New ration cards: 11ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. 11ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది రేవంత్ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.

New Update

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. 11ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది రేవంత్ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో 11 మంది లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు. తిరుమలగిరి తహసీల్దార్‌ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం 11 మంది లబ్ధిదారులకు కార్డులు అందిస్తారు. అనంతరం బహిరంగసభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80 వేల మందితో బహిరంగసభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సామేల్‌ కార్డుల పంపిణీ, సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

3లక్షల 58వేల మంది లబ్ధిదారులు

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 58వేల మంది లబ్ధిదారుల చేతికి కొత్త రేషన్ కార్డులు అధికారులు అందించనున్నారు. 11 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. 

 latest-telugu-news | news-ration-cards | cm-revanth-reddy | suryapet | thungathurthi | ration cards distribution in telangana

Advertisment
Advertisment
తాజా కథనాలు