/rtv/media/media_files/2025/07/14/murder-2025-07-14-07-25-08.jpg)
Surveyor Tejeshwar Case:
ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు(Surveyor Tejeshwar News) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావుల వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ఇప్పటికే తేల్చేశారు. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచే తేజేశ్వర్ హత్యకు(kurnool tejeshwar case) కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఆషాఢంలోనే అతడిని అంతం చేయాలని ఐశ్వర్య, తిరుమలరావు ప్లాన్ వేసుకున్నారు. పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యతో సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశారు.
Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి
ఐశ్వర్య తల్లికి కూడా తిరుమలరావుతో సంబంధం ఉన్నట్లు, తేజేశ్వర్ వారి కామకలాపాలకు అడ్డుగా ఉన్నాడని భావించి ఈ హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సీసీ ఫుటేజీ, సెల్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. వివిధ బృందాలుగా ఏర్పడి నిందితులను విచారించి వాంగ్మూలాలను రికార్డు చేశారు. హత్యకు ముందు ఐశ్వర్య, తిరుమలరావు మధ్య జరిగిన ఫోన్ కాల్స్, ఆడియో లీకులు కూడా బయటపడ్డాయి. అయితే ఈ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
రెండో పెళ్లి చేసుకుంటానని
ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. మరోవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువుపోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య, తేజేశ్వర్‌ని వివాహం చేసుకుంది. పెళ్లి అయ్యాక కూడా ఐశ్వర్య, తిరుమలరావు ఎప్పుడూ ఫోన్‌లో టచ్ లో ఉండేవారు. ఆమె భర్త తేజేశ్వర్, వాళ్ల కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు తిరుమలరావు ఓ వాయిస్ ఛేంజర్ డివైజ్ ను కొనుగోలు చేశాడు. దీని సాయంతో మహిళ గొంతుగా ఐశ్వర్యతో మాట్లాడేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ డివైస్ ను పోలీసులు కర్నూలులో తిరుమలరావు పనిచేసే బ్యాంకులో స్వాధీనం చేసుకున్నారు. అయితే తేజేశ్వర్ బతికుంటే ఎప్పటికైనా ప్రమాదమే అని భావించిన ఐశ్వర్య అతన్ని వెంటనే చంపేయాలని ప్రియుడిన రెచ్చగొట్టింది.
Also Read: ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!
దీంతో తిరుమలరావు, ఐశ్వర్యలు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం ముందుగానే రూ.20 లక్షల రుణం కూడా తీసుకున్నారు. హత్య తర్వాత లడఖ్ లేదా అండమాన్ వంటి ప్రాంతాలకు పారిపోవాలని, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలని కూడా ప్రణాళిక వేసుకున్నారు. ప్లాన్ లో భాగంగా జూన్ 17వ తేదీన కారులో తీసుకువెళ్లి అతన్ని వేట కొడవళ్లు, కత్తులతో గొంతు కోసి చంపేశారు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన సోదరి, నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉరితీయాలని డిమాండ్ చేశారు.