🔴Live News Updates: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

EX MLA Prasanna Kumar Reddy: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి - ఫర్నీచర్, కారు ధ్వంసం

నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటిలోని ఫర్నీచర్, వాహనాలు ధ్వంసం చేశారు. కోవూరు ఎమ్మెల్యేపై వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది.

attack on kovur ex mla nallapareddy prasanna kumar reddy house
attack on kovur ex mla nallapareddy prasanna kumar reddy house

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం (జూలై 7) రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరు నగరంలోని సావిత్రినగర్‌లో ఉన్న ఆయన ఇంటిలోని ఫర్నీచర్‌తో పాటు వాహనాలను ధ్వంసం చేశారు.

EX MLA Prasanna Kumar Reddy

దాడికి కారణాలు..

అందుతున్న సమాచారం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కొందరు గుర్తుతెలియని దుండగులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి వీరంగం సృష్టించినట్లు సమాచారం. అయితే కొందరు ఈ దాడిని టీడీపీ శ్రేణులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు చేశారని ఆరోపిస్తున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వానలే వానలే!

ఫర్నీచర్, కారు ధ్వంసం

ఈ దాడిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిలోని ఫర్నీచర్, కారుతో పాటు ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరని సమాచారం. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. 

Also Read: పరేషాన్ కావొద్దు.. రెస్టారెంట్ పన్నీర్ టిక్కా మసాలా రెసిపీ మీ ముందుకు

వైసీపీ నేతలు ఫైర్..

దాడి జరిగిన వెంటనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు వైసీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ దాడికి బాధ్యులని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ దాడికి కారణమైన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Also Read:వర్షం వల్ల వచ్చే తేమతో దురద, చెమట సమస్య! అయితే ఈ ఆకులను నీటిలో కలిపి స్నానం చేయండి

Also Read:చెడు కొలెస్ట్రాల్ పెరిగిందా! కాళ్ళలో ఈ 5 లక్షణాలు ఉంటే నివారణ ఉపాయాలు తెలుసుకోండి

  • Jul 08, 2025 20:59 IST

    యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

    భారత్‌లో వరుస భూకంపాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. అస్సాం, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లో భూంకపాలు రావడం కలకలం రేపింది.



  • Jul 08, 2025 18:59 IST

    పెళ్లి చేసుకుంటానని మోసం.. ప్రియుడి ఇంటిముందు ధర్నా

    మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ ప్రేమికురాలు తను ప్రేమించిన యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనను నమ్మించి వాడుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటిముందు మౌన పోరాటం చేయడం సంచలనం సృష్టించింది. ఆమె కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగిందా యువతి.

    Dharna in front of lover's house



  • Jul 08, 2025 17:30 IST

    హైదరాబాద్‌లో బాంబు బెదిరింపులు.. .బాంబు స్క్వాడ్ షాక్‌...

    హైదరాబాద్‌ లోని సిటీ సివిల్ కోర్టు , జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, రాజ్‌భవన్ తదితర ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు 3 గంటల పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

     

    bomb threat to civil court
    bomb threat to civil court

     



  • Jul 08, 2025 16:13 IST

    ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి

    యూపీలో మైనర్ బాలిక రైల్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును రైలు వాష్ రూమ్ లో వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కన్నపేగును కాటేశాడన్న కఠిన నిజం తెలిసి జనం నివ్వెరపోయారు.

     

    READ MORE

     



  • Jul 08, 2025 15:18 IST

    రేవంత్‌ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్‌ కీలకవ్యాఖ్యలు

    మాట తప్పడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌రెడ్డికి రచ్చ చేయటమే తప్చ చర్చ చేయటం రాదని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కి రావాలని తాను సవాల్ చేస్తే రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

     

    ktr vs revanth reddy
    ktr vs revanth reddy

     



  • Jul 08, 2025 14:40 IST

    స్థానిక ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లు.. పీసీసీ చీఫ్ సంచలన ప్రకటన!

    42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నది తమ ఆలోచన అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 10 మంది సిద్ధంగా ఉన్నారన్నారు.

    Mahesh Kumar Goud



  • Jul 08, 2025 14:29 IST

    హైదరాబాద్ లోని ఆ 5 ప్రాంతాల్లో బాంబులు.. షాకింగ్ మెయిల్!

    హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. రాజ్‌భవన్‌, పాతబస్తీలోని సిటీ సివిల్‌ కోర్టు, జింఖానా క్లబ్‌, సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టుల్లో బాంబ్ పెట్టినట్లు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ పంపించాడు.

     

    bomb threat to civil court
    bomb threat to civil court

     



  • Jul 08, 2025 14:28 IST

    10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధి.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల ఓ వ్యక్తికి పదేళ్ల నుంచి ఉన్న సమస్యను చాట్‌జీపీటీ కేవలం కొన్ని నిమిషాల్లోనే పరిష్కరించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌ అయ్యింది.

     

    Reddit user claims ChatGPT uncovered medical condition doctors overlooked for a decade
    Reddit user claims ChatGPT uncovered medical condition doctors overlooked for a decade

     



  • Jul 08, 2025 13:54 IST

    BRS vs Congress: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ సవాల్

    అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ పెట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లేఖ రాయించాలని తెలిపారు.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • Jul 08, 2025 13:51 IST

    Pawan Kalyan: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. పవన్ కళ్యాణ్ సిరీయస్ వార్నింగ్

    YCP మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

     

    pawan kalyan serious warning to ycp ex MLA Nallapureddy prasanna kumar reddy
    pawan kalyan serious warning to ycp ex MLA Nallapureddy prasanna kumar reddy

     



  • Jul 08, 2025 13:51 IST

    Amazon Prime Day Sale 2025: అమెజాన్ బంపర్ సేల్.. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై 80 శాతం వరకు తగ్గింపు

    అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్ 2025’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. జూలై 12 నుంచి 14 వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, కెమెరాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు వంటి అనేక వస్తువులపై 80శాతం వరకు డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది.

     

    Amazon Prime Day Sale 2025
    Amazon Prime Day Sale 2025

     



  • Jul 08, 2025 13:33 IST

    Hyderabad: హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

    HYDలోని పాతబస్తీలో సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్టు ఓ వ్యక్తి ఫోన్‌ చేయడంతో వెంటనే కోర్టు కార్యకాలాపాలు నిలిపివేశారు. పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. 

     

    bomb threat to Hyderabad city civil court
    క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

     



  • Jul 08, 2025 11:24 IST

    BREAKING: సరిహద్దుల్లో భారీ వరదలు.. 200లకు పైగా వాహనాలు?

    నేపాల్‌-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదల వల్ల భోటెకోషి నది ఉప్పొంగింది. దీంతో మిటేరి వంతెన వరదల్లో కొట్టుకుపోయింది. నదీ నుంచి వరద ఉధృతం రావడంతో నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపి ఉంచిన 200 వాహనాలు వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

     

    Nepal China Heavy Rains
    Nepal China Heavy Rains

     



  • Jul 08, 2025 11:23 IST

    BIG BREAKING: హరీశ్ రావుకు మరోసారి నోటీసులు..!

    మాజీ మంత్రి హరీశ్ రావుకు కాళేశ్వరం కమిషన్ మరోసారి నోటీసులు పంపింది. గత నెల విచారణకు హరీశ్ రావు హాజరు కాగా.. మరోసారి నేడు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, మేడిగడ్డ, అన్నారంపై జస్టిస్‌ పీ చంద్రఘోష్‌ కమిషన్‌ విచారించనుంది.

    harish rao  pa arrest



  • Jul 08, 2025 11:23 IST

    Gastrointestinal Cancer: ఈ సంవత్సరాల్లో పుట్టిన వారికి క్యాన్సర్.. భారత్‌లోనే ప్రమాదం ఎక్కువ

    2008 నుంచి 2017 మధ్య పుట్టిన వారికి ఏదో ఒక సమయంలో జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. సుమారు 1.5 కోట్ల మందికి తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ క్యాన్సర్ బారిన పడతారట. ఈ జాబితాలో చైనా, భారత్ వరుస స్థానాల్లో ఉన్నాయి.

     

    Gastrointestinal cancer
    Gastrointestinal cancer

     



  • Jul 08, 2025 11:21 IST

    EX MLA Prasanna Kumar Reddy: నన్ను చంపేసేవారు.. పవన్ స్పందించు: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్

    తన ఇంటిపై జరిగిన దాడిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను హతమార్చడానికే ఈ దాడి జరిగిందని, తాను ఇంట్లో ఉంటే కచ్చితంగా తనను చంపేసేవారని పేర్కొన్నారు. తాను లేకపోవడంతో తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

     

    EX MLA Prasanna Kumar Reddy responds after attack on his house
    EX MLA Prasanna Kumar Reddy responds after attack on his house

     



  • Jul 08, 2025 10:26 IST

    Khammam Crime: మామ, కోడలు శృంగారం.. కూతురు చూడటంతో చంపేశారు - కోర్టు సంచలన తీర్పు

    కన్న కూతుర్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన కేసులో తల్లితోపాటు ఆమె మామకూ ఖమ్మం కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి న్యాయస్థానంలో జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్‌ సోమవారం తీర్పు చెప్పారు.

     

    videotaping married woman taking bath (1)
    videotaping married woman taking bath (1)

     



  • Jul 08, 2025 09:49 IST

    Kadapa Minor Girl Rape: ఏపీలో దారుణం.. బాలికపై రేప్ - షాకింగ్ వీడియో

    కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లికి చెందిన మైనర్ బాలికపై రేప్ జరిగింది. గొర్రెలు మేపుకునేందుకు కొండల్లోకి వెళ్లగా.. అక్కడ మద్యం సేవిస్తున్న యువకులు ఆమెపై లైంగిక దాడి చేశారు. వద్దు అని వేడుకున్న ఆ బాలిక వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

     

    andhra pradesh Kadapa Minor Girl Raped
    andhra pradesh Kadapa Minor Girl Raped

     



  • Jul 08, 2025 09:29 IST

    Thyroid: చేతుల్లో ఈరాయి ఉంటే చాలు థైరాయిడ్ కారణంగా పెరిగిన బరువుని తగ్గించుకోవచ్చు

    థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేని వరకు.. మహిళలు బరువు తగ్గడం కష్టం. అటువంటి సమయంలో సరైన ఆహారం, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామంతోపాటు ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ థైరాయిడ్ కారణంగా పెరిగిన బరువును తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

     

    Thyroid
    Thyroid

     



  • Jul 08, 2025 09:29 IST

    TG Crime: తాగుబోతు తల్లి..అడ్డొస్తుందని కూతురిని లేపేసింది

    నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోన్గొప్పులలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లితనాన్ని మరిచిన ఓ మహిళ తానే స్వయంగా తన ఐదు నెలల పసిబిడ్డ శివానిని గొంతు నులిమి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

    Hyderabad Crime News
    Hyderabad Crime News

     



  • Jul 08, 2025 09:27 IST

    Face Pack: మీకు తెలుసా ఈ ఫేస్ ప్యాక్ 15 నిమిషాల్లో ముఖం మిలమిల మెరిసిపోతుంది!

    బియ్యం పిండి తక్షణ మెరుపు కోసం 2 వస్తువులను కలిపిన ఫేస్ ప్యాక్ మంచిది. కలబంద జెల్‌కు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కలపాలి. ఈ పేస్ట్‌నుఫేస్ ప్యాక్‌గా ముఖం, మెడపై అప్లై చేసి వృత్తాకార కదలికలలో సున్నితంగా మసాజ్ చేయాలి.10 నిమిషాల తర్వాత ఈ ప్యాక్‌ను కడగాలి.

     

    Face pack
    Face pack

     



  • Jul 08, 2025 09:25 IST

    USA: ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయండి..ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. దానికి నామినేట్ కూడా చేశారు. పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ చాలా చేశారని పొగడ్తలలో ముంచెత్తారు. 

     

    trump, netanyahu
    Trump-Netanyahu Meeting

     



  • Jul 08, 2025 09:25 IST

    AI: ఏఐ మ్యాజిక్..150 ఏళ్ళకు పెరగనున్న మనిషి జీవితం

    మానవ జీవితం వందేళ్ళు అని అంటారు. కానీ అంతకాలం బతికే వాళ్ళు వేళ్ళమీదనే ఉంటారు. కానీ ఇప్పుడు ఇదే మనిషి జీవితం 150 ఏళ్ళు అని చెబుతున్నారు. ఏఐతో ఈ మ్యాజిక్ జరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

     

    AI , human
    Life span with AI

     



  • Jul 08, 2025 09:24 IST

    BIG BREAKING: టార్గెట్ గణపతి.. నేషనల్ పార్క్ ను చుట్టుముట్టిన 25000 మంది పోలీసులు!

    వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే చర్యలను చేపట్టింది. కీలక నేత గణపతి టార్గెట్ గా బీజాపూర్ లోని నేషనల్ పార్క్ లో 25 వేల బలగాలను మోహరించారని వార్తలు వినిపిస్తున్నాయి. 

     

    Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead
    Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead

     



  • Jul 08, 2025 09:23 IST

    Trump Tariffs: జపాన్, కొరియాలకు వాయింపు..భారత్ తో ఒప్పందానికి సానుకూలం

    అమెరికా అధ్యక్షుడు మళ్ళీ టారీఫ్ ల గోల మొదలెట్టారు. తమతో ఒప్పందం చేసుకోని జపాన్, కొరియాలతో సహా 14 దేశాలపై 25 శాతం సుంకాలు విధించారు. భారత్ తో మాత్రం అగ్రిమెంట్ కు సానుకూలంగా ఉన్నట్టు సూచనలిచ్చారు.

     

    pm modi trump
    pm modi donald trump Photograph: (pm modi donald trump)

     



  • Jul 08, 2025 09:20 IST

    BREAKING: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. నుజ్జునుజ్జైన బస్సు

    తమిళనాడులో స్కూల్‌ వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

     

    Tamilnadu
    Tamilnadu

     



  • Jul 08, 2025 09:19 IST

    BIG BREAKING: కీరవాణి తండ్రి కన్నుమూత

    ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త (92) కన్నుమూశారు. హైదరాబాద్‌లో శివశక్తి దత్త మృతి చెందారు. ఇతను ఛత్రపతి, సై, రాజన్న, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, హనుమాన్ సినిమాలకు పాటలు రాశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివ శక్తి దత్త సోదరులు అవుతారు.

     

    Keeravani Father
    Keeravani Father

     



  • Jul 08, 2025 08:06 IST

    BREAKING: యువతి ఫిర్యాదు.. ఆర్సీబీ బౌలర్‌పై కేసు నమోదు!

    యూపీలో ఆర్సీబీ బౌలర్‌ యశ్‌ దయాళ్‌‌పై కేసు నమోదైంది. ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి లైంగిక వేధింపులు, దోపిడీ ఆరోపణలతో సీఎం గ్రీవెన్స్‌ పోర్టల్‌లో యశ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 69 కింద కేసు నమోదు చేశారు.

     

    Yash Dayal
    Yash Dayal

     



  • Jul 08, 2025 08:06 IST

    Mumbai: డబ్బు ఇవ్వకపోతే అడల్ట్ వీడియో వైరల్ చేస్తాం.. చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య!

    ముంబైలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఉంటున్న ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ రాజ్‌మోర్ ఆత్మహత్య చేసుకున్నారు. సబా ఖురేషి, రాహుల్ పర్న్వానీ అనే ఇద్దరు వ్యక్తులు అడల్ట్ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలతోనే సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు.

     

    Hyderabad Crime News
    Hyderabad Crime News

     



  • Jul 08, 2025 08:05 IST

    Mobile Tariff Hike: మొబైల్‌ యూజ్ చేసే వారికి బిగ్ షాక్.. ఊహించని విధంగా భారీగా ధరలు పెరుగుదల

    ఏడాది కింద టెలికాం సంస్థలు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టారిఫ్ ప్లాన్‌లను పెంచాలని చూస్తున్నాయి. ఈ సారి 10 నుంచి 12 శాతం వరకూ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

     

    Mobile Tariff Hike
    Mobile Tariff Hike

     



  • Jul 08, 2025 08:05 IST

    Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వానలే వానలే!

    పశ్చిమ బెంగాల్‌ సమీపంలో అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    hyd-rains



  • Jul 08, 2025 07:46 IST

    Hari Hara VeeraMallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

    పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ నుంచి మరో సర్‌ప్రైజ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ ట్రాక్‌ వీడియోను ఈ వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

     

    pawan kalyan Hari Hara VeeraMallu title track releasing this week
    pawan kalyan Hari Hara VeeraMallu title track releasing this week

     



  • Jul 08, 2025 07:45 IST

    Ap Road Accident: ఏపీలో ఘోరం.. బోల్తా పడి పల్టీలు కొట్టిన కారు - ముగ్గురు స్పాట్ డెడ్

    అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.

     

    anantpuram road accident three young men dead
    anantpuram road accident three young men dead

     



  • Jul 08, 2025 07:45 IST

    Kingdom Release Date: మాస్ మమ మాస్.. దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్ ప్రోమో సూపరెహే

    విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్డమ్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

     

    Kingdom Release Date
    Kingdom Release Date

     



  • Jul 08, 2025 06:52 IST

    EX MLA Prasanna Kumar Reddy: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి - ఫర్నీచర్, కారు ధ్వంసం

    నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటిలోని ఫర్నీచర్, వాహనాలు ధ్వంసం చేశారు. కోవూరు ఎమ్మెల్యేపై వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది.

     

    attack on kovur ex mla nallapareddy prasanna kumar reddy house
    attack on kovur ex mla nallapareddy prasanna kumar reddy house

     



  • Jul 08, 2025 06:52 IST

    Paneer Tikka: పరేషాన్ కావొద్దు.. రెస్టారెంట్ పన్నీర్ టిక్కా మసాలా రెసిపీ మీ ముందుకు

    పనీర్ టిక్కా తినడానికి ఇష్టపడితే.. దాన్ని రెస్టారెంట్ స్టైల్ టేస్టీ వెజిటేబుల్‌ను కూడా ప్రయత్నించవచ్చు. రెస్టారెంట్ స్టైల్ పనీర్ టిక్కా మసాలా ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్ధాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

     

    Paneer Tikka
    Paneer Tikka

     



Advertisment
Advertisment
తాజా కథనాలు