EX MLA Prasanna Kumar Reddy: నన్ను చంపేసేవారు.. పవన్ స్పందించు: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్

తన ఇంటిపై జరిగిన దాడిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను హతమార్చడానికే ఈ దాడి జరిగిందని, తాను ఇంట్లో ఉంటే కచ్చితంగా తనను చంపేసేవారని పేర్కొన్నారు. తాను లేకపోవడంతో తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
EX MLA Prasanna Kumar Reddy responds after attack on his house

EX MLA Prasanna Kumar Reddy responds after attack on his house

EX MLA Prasanna Kumar Reddy: తన ఇంటిపై సోమవారం (జూలై 7) రాత్రి జరిగిన దాడి అనంతరం వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన.. దీని వెనుక టీడీపీ శ్రేణులు, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉందని ఆరోపించారు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయా చర్యలకు పాల్పడతారని తాను అస్సలు ఊహించలేదని తెలిపారు.

Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

దాడి అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. తన ఇంట్లోని ఫర్నీచర్, వాహనాలను ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీడీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం చేశారని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

నన్ను చంపేసేవారు

తనను హతమార్చడానికే ఈ దాడి జరిగిందని అన్నారు. తాను ఇంట్లో ఉంటే కచ్చితంగా తనను చంపేసేవారని పేర్కొన్నారు. తాను లేకపోవడంతో తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని.. ఇలాంటి దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని తెలిపారు. డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన కుర్చీలో కూర్చినిపోవటం కాదని ఘాటు విమర్శలు గుప్పించారు. 

Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

జగన్ పరామర్శ:

ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసన్న కుమార్ రెడ్డిని ఫోన్‌లో పరామర్శించినట్లు సమాచారం. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు