/rtv/media/media_files/2025/07/08/pawan-kalyan-hari-hara-veeramallu-title-track-releasing-this-week-2025-07-08-07-36-21.jpg)
pawan kalyan Hari Hara VeeraMallu title track releasing this week
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hari Hara VeeraMallu title track
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో తెలుసుకునే ముందు.. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పవన్ పవర్ ఫుల్ లుక్స్ అండ్ యాక్షన్ సీన్స్ సినీ ప్రియుల్ని, అభిమానుల్ని ఎంతగానో అలరించాయి.
ఈ ట్రైలర్ ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఈ తరుణంలో తాజాగా మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో వారం రోజుల్లో ‘హరిహర వీరమల్లు’ మూవీ మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ట్రాక్ వీడియోను ఈ వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ వార్తతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఆ వీడియో సినిమాపై ఇంకెన్ని అంచనాలు పెంచుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూలై 3న విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. పవన్ కళ్యాణ్ రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు.
వివాదంలో ‘హరిహర వీరమల్లు’
అయితే ఈ సినిమా ఇటీవల ఓ వివాదంలో చిక్కుకుంది. తెలంగాణలోని పలు వెనుకబడిన తరగతుల (BC) సంఘాలు, ముదిరాజ్ కమ్యూనిటీ గ్రూపులు ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్ర, వీరమల్లు, తెలంగాణ జానపద వీరుడు పండుగ సాయన్నను పోలి ఉందని.. అయితే ఆయన పేరును గానీ, వారసత్వాన్ని గానీ సినిమాలో ప్రస్తావించడం లేదని ఆరోపిస్తున్నాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారని, కమ్యూనిటీల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఈ సంఘాలు విమర్శిస్తున్నాయి. తమ ఆందోళనలను పరిష్కరించకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి.