/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
Hyderabad Crime News
ముంబైలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఉంటున్న ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌మోర్ ముంబైలో ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఇతన్ని సబా ఖురేషి, రాహుల్ పర్న్వానీ అనే ఇద్దరు వ్యక్తులు అడల్ట్ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ మేరకు ఆత్మహత్య చేసుకుంటూ రాజ్ మోర్ మూడు పేజీల సూసైడ్ నోట్‌ను రాశాడు.
ఇది కూడా చూడండి:Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
मुंबई में चार्टेड एकाउंटेंट ने की जहर खाकर खुदकुशी, एडल्ट वीडियो के नाम पर कर रहे थे ब्लैकमेल #Mumbai#MumbaiCASuicide#Blackmail#Tragedyhttps://t.co/yEbBlLSdgr
— AajTak (@aajtak) July 8, 2025
ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
సూసైడ్ లెటర్ రాసి..
అందులో సబా ఖురేషి, రాహుల్ పర్న్వానీ అనే ఇద్దరు వ్యక్తులు తన మరణానికి కారణమని ఆరోపించారు. దీని ఆధారంగా పోలీసులు వారిద్దరిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, బలవంతపు వసూళ్ల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.గత 18 నెలల్లో రాజ్ మోర్ నుండి సుమారు 3 కోట్ల రూపాయలను బలవంతంగా వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాహుల్ పర్న్వానీ రాజ్ ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసి, ఆపై సబా ఖురేషితో కలిసి వాటిని వైరల్ చేస్తానని బెదిరించి భారీ మొత్తంలో డబ్బును వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి
రాజ్ సోషల్ మీడియా ద్వారా సబా ఖురేషిని కలిశాడు. క్రమంగా ఇద్దరి మధ్య రిలేషన్ పెరిగింది. ఈ సమయంలో రాహుల్ రాజ్ వ్యక్తిగత వీడియోలను తయారు చేసి, ఆపై అతన్ని బెదిరించడం ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. రాజ్ మానసికంగా కుంగిపోయాడు. దీంతో సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. నిందితులు ఇద్దరు పరారయ్యారు. పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు.