/rtv/media/media_files/2025/07/08/bomb-threat-to-civil-court-2025-07-08-14-05-05.jpg)
bomb threat to civil court
Bomb Threat: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. రాజ్‌భవన్, పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబ్ పెట్టినట్లు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. దీంతో పోలీస్ యంత్రాగం అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
Also Read: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్
పాతబస్తీ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్స్
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025
సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్‌లో 4 ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్లు మెయిల్స్
కోర్టులో పేలుడు జరిగిన 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందంటూ మెయిల్
4 చోట్ల తనిఖీలు… pic.twitter.com/P5Feq3CmDq
Also Read: Kingdom Release Date: మాస్ మమ మాస్.. దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్ ప్రోమో సూపరెహే
బాంబు బెరింపు మెయిల్
ఈ మేరకు పోలీసులు సివిల్ కోర్టులో ఉన్న లాయర్లు, ప్రజలను బయటకు పంపించేశారు. అలాగే కోర్టు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపేతుందంటూ మెయిల్‌లో పేర్కొన్నాడు. అబిదా అబ్దుల్లా పేరుతో బాంబు బెదిరింపు మెయిల్ పింపాడు. ఇక ఈ ఆగంతకుల మెయిల్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నాలుగు చోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు.
Also Read : హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు
telugu-news | Bomb Threat News | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news live updates | telangana-news-updates | breaking news in telugu | Raj Bhavan