Chat GPT: 10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధి.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల ఓ వ్యక్తికి పదేళ్ల నుంచి ఉన్న సమస్యను చాట్‌జీపీటీ కేవలం కొన్ని నిమిషాల్లోనే పరిష్కరించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌ అయ్యింది.

New Update
Reddit user claims ChatGPT uncovered medical condition doctors overlooked for a decade

Reddit user claims ChatGPT uncovered medical condition doctors overlooked for a decade

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం చాలామంది చాట్‌జీపీటీ, జెమినై, డీప్‌సీక్‌ లాంటి ఏఐ చాట్‌బాట్‌ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా చాట్‌జీపీటీని చూసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. ఇటీవల ఓ వ్యక్తికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను గుర్తించింది. పదేళ్ల నుంచి ఆయనకు ఉన్న సమస్యను చాట్‌జీపీటీ కేవలం కొన్ని నిమిషాల్లోనే పరిష్కరించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌ అయ్యింది. 

Also Read: ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగల దోపిడి.. అప్పటికి ఎన్ని సార్లు చేశారో తెలుసా..?

Also Read :  హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

Reddit User Claims ChatGPT Uncovered Medical Condition

ఇక వివరాల్లోకి వెళ్తే రెడ్డిట్‌లో అతడు పోస్ట్ చేశాడు. '' చాట్‌జీపీటీ 10 ఏళ్లకు పైగా ఉన్న సమస్యను నిమిషాల్లోనే పరిష్కరించింది. వైద్యులు కూడా దీన్ని గుర్తించలేకపోయారు. నేను స్పైనల్ MRI, CT స్కాన్, రక్త పరీక్షలు, లైమ్ వ్యాధి కోసం టెస్టులు చేయించాను. ఎన్నో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారు. న్యూరాలజిస్ట్‌తో పాటు అనేక మంది నిపుణులను సంప్రదించాను. ఫంక్షనల్ హెల్త్‌ టెస్ట్ చేయించాను. అప్పుడు నాకు హోమోజైగస్ A1298C MTHFR మ్యూటేషన్ ఉన్నట్లు తెలిసింది. ఈ సమస్య 7 నుంచి 12 శాతం మందిలో మాత్రమే ఉంటుంది.  

Also Read: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. నుజ్జునుజ్జైన బస్సు

నా ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలను, ల్యాబ్‌ రిపోర్టును చాట్‌ జీపీటీని అడిగినప్పుడు ఈ మ్యూటేషన్ గురించి తెలిసింది. ఈ సమస్య MTHFR మ్యూటేషన్‌తో సంబంధం ఉంది. నా శరీరంలో బీ12 లెవెల్స్‌ సాధారణంగా కనిపించినా.. ఈ మ్యూటేషన్ వల్ల శరీరం బీ12ని సరిగ్గా ఉపయోగించలేకపోతోంది. అందుకే సప్లిమెంట్లు తీసుకోవాలని చాట్‌జీపీడీ సూచించింది. ఇది చూసి నేను షాకయ్యాయని'' ఆ యూజర్ తెలిపాడు. ఈ పోస్ట్ వైరలవ్వడంతో నెటిజెన్లు కూడా షాకవుతున్నారు. చాలామంది వాళ్లకి ఉన్న ఆరోగ్య సమస్యలను కూడా చాట్‌జీపీటీతో పంచుకొని పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. 

Also Read :  ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగల దోపిడి.. అప్పటికి ఎన్ని సార్లు చేశారో తెలుసా..?

Chat GPT | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు