BIG BREAKING: టార్గెట్ గణపతి.. నేషనల్ పార్క్ ను చుట్టుముట్టిన 25000 మంది పోలీసులు!

వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే చర్యలను చేపట్టింది. కీలక నేత గణపతి టార్గెట్ గా బీజాపూర్ లోని నేషనల్ పార్క్ లో 25 వేల బలగాలను మోహరించారని వార్తలు వినిపిస్తున్నాయి. 

New Update
Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead

Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead

ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్ కౌంటర్ లో కీలక నేతలను మట్టుబెట్టింది. ఇప్పుడు మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితోపాటు.. గెరిల్లా తంత్రాల్లో ఆరితేరిన పీఎల్‌జీ ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా, మరో అగ్రనేత దేవా టార్గెట్ గా మరో ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. బీజాపూర్ లోని దండకారణ్యంలో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 25 వేల బలగాలను మోహరించారని తెలుస్తోంది. పోలీసు బలగాలు మొత్తం ఆ ప్రాంతంపై పట్టు సాధించాయని చెబుతున్నారు. అలానే సోమవారం మధ్యాహ్నం జరిగిన స్వల్ప ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత సోంది కన్నా మృతి చెందారు. ఈ నేపథ్యంలో బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లొంగి పోతారా.. లేదంటే ఎన్‌కౌంటరై పోతారా అంటూ మావోయిస్టులకు ఆయన హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

మరోవైపు ఈ కూంబింగ్ విషయంపై పౌర హక్కుల నేతల ఆందోళనలు కూడా దీనికి పరోక్షంగానే అవుననే సమాధానం చెబుతున్నాయి. నేషనల్‌పార్క్‌ ఆపరేషన్‌ను వెంటనే ఆపేయాలని తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్‌ చేశారు. మావోయిస్టులను సజీవంగా పట్టుకుని కోర్టులో హాజరుపరచాలని కూడా కోరారు. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ పెసా, అటవీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. 

వెనక్కు వచ్చిన కేంద్ర బలగాలు..

ఈ ఏడాది మార్చి నుంచి కేంద్ర బలగాలు తెలంగాణ-ఛత్తీస్ ఘఢ్‌ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భారీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అయితే మధ్యలో పహల్గాం అటాక్ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ కోసం ఈ బలగాలను అక్కడికి తరలించారు. ఆ తర్వాత డీఆర్జీ బలగాలు మాత్రమే కూంబింగ్‌ కొనసాగించాయి. గత నెల నేషనల్‌ పార్క్‌లో అతిపెద్ద ఆపరేషన్‌ను నిర్వహించి, కేంద్ర బలగాల సహకారం లేకుండానే 17 మంది మావోయిస్టులను హతమార్చాయి. అయితే ఇప్పుడు సరిహద్దులకు వెళ్ళిన బలగాలు మళ్ళీ తిరిగి వచ్చాయని దండకారణ్యాన్ని చుట్టుముట్టాయని చెబుతున్నారు. కానీ మరోవైపు సరిహద్దులకు వెళ్ళిన కేంద్ర బలగాలు తిరిగి వెనక్కు రావడం అంత తొందరగా జరగదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. 

Also Read: Trump Tariffs: జపాన్, కొరియాలకు వాయింపు..భారత్ తో ఒప్పందానికి సానుకూలం

Advertisment
Advertisment
తాజా కథనాలు