/rtv/media/media_files/2025/07/08/trump-netanyahu-2025-07-08-09-16-04.jpg)
Trump-Netanyahu Meeting
వైట్ హౌస్ లో ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ నెతన్యాహు సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. ఈ సందర్భంగానే ట్రంప్ ను నోబెల్ శాంతి బహమతికి నాిేట్ చేస్తున్నట్టు నెతన్యాహు ప్రకటించారు. దీనికి సంబంధించిన లేఖను ఆయనకు అందజేశారు. నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ అర్హుడని.. దాన్ని పొందాలని ఇజ్రాయెల్ ప్రధాని కోరారు. శాంతి కోసం ఆయన చాలా కృషి చేస్తున్నారని పొగిడారు. రీసెంట్ గా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఇక నెతన్యాహు నుంచి శాంతి బహుమతికి మద్దతు లభించడం చాలా ఆనందంగా, అర్థవంతంగా ఉందని అన్న ట్రంప్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
🚨#BREAKING: Israeli Prime Minister Netanyahu tells President Donald Trump he is nominating him for the Nobel Peace Prize pic.twitter.com/SOAFvyjZBl
— R A W S A L E R T S (@rawsalerts) July 7, 2025
విడివిడిగా సమావేశాలు..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సోమవారం అమెరికాలో పర్యటించారు. గాజాలో కాల్పులు, ఆర్మీ కొనసాగింపు, బందీల విడుదలపై వంటి విషయాలపై ట్రంప్ తో ఆయన చర్చించారని తెలుస్తోంది. అలాగే హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల కోసం ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం. ట్రంప్ లో పాటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌లతో కూడా విడివిడిగా నెతన్యాహు సమావేశమయ్యారు.
Also Read: BIG BREAKING: టార్గెట్ గణపతి.. నేషనల్ పార్క్ ను చుట్టుముట్టిన 25000 మంది పోలీసులు!