BIG BREAKING: స్థానిక ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లు.. పీసీసీ చీఫ్ సంచలన ప్రకటన!

42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నది తమ ఆలోచన అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 10 మంది సిద్ధంగా ఉన్నారన్నారు.

New Update
Mahesh Kumar Goud

తాను స్పందించే అంతా స్థాయి కేటీఆర్ ది కాదని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడాలి అంటే అసెంబ్లీ ఉంది కదా అని అన్నారు. అసెంబ్లీలో ప్రతి పక్షాలకే ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. 15 తేదీలోగా కొత్త డీసీసీ కమిటీలు వస్తాయన్నారు. డీసీసీల ఎన్నిక కోసమే సీనియర్ ఇన్ఛార్జిలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీసీసీల కమిటీ ప్రక్రియ పూర్తి అయ్యాక.. డీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ఏఐసీసీ అబ్జర్వర్లు త్వరలో రాష్ట్రానికి వస్తారన్నారు. ఈ నెల చివరి వరకు అన్ని కమిటీలు పూర్తి అవుతాయన్నారు.

Also Read :  పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ.. అసీమ్ మునీర్‌ తిరుగుబాటు

యూరియా కరువు అంటూ బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందన్నారు. తమ ప్రభుత్వం యూరియా సప్లై పెంచిందన్నారు. కానీ, బీఆర్ఎస్ యూరియా కరువు అంటూ అబద్ధాలు చెబుతోందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలన్నది తమ ఆలోచన అని చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. అనిరుద్ రెడ్డి అంశంపై మల్లు రవి విచారణ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని.. అందుకే నిరసనలు చేస్తున్నారన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా లైవ్ లోనే ఉందన్నారు. త్వరలో మహిళల సీట్లతో పాటు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్నారు.

మంత్రి పదవుల అంశం తన పరిధిలో లేదన్నారు. రాజకీయాల్లో ఒక్కో సారి జూనియర్ లకు ముందు అవకాశాలు వస్తాయని.. సీనియర్లను సైతం పార్టీలు గుర్తిస్తాయన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తాము గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

Also Read :  రేవంత్‌ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్‌ కీలకవ్యాఖ్యలు

Also Read :  ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు పంపిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన

జూబ్లీహిల్స్ బరిలో 10 మంది..

జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు 10 మంది సమర్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. వేరే పార్టీ నుండి ఎందుకు అభ్యర్థిని తీసుకుంటామని ప్రశ్నించారు. తమ హయాంలో నిర్భందాలు లేవని.. అందుకే కవిత ధర్నాలు చేస్తోందన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అవినీతి పై మాట్లాడితే అరెస్ట్ లు చేశారన్నారు. కాళేశ్వరం వద్దకు వెళ్దాం అనుకుంటే నిర్బంధించారన్నారు. తనను బొల్లారం పోలీస్ స్టేషన్ లో సాయంత్రం వరకు ఉంచారన్నారు. ఎక్కడబడితే అక్కడ అరెస్టు లు ఉండేవన్నారు. 

Also Read :  స్టార్ హీరో ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్.. ఫ్యాన్స్ జాగ్రత్తమ్మా!

telugu breaking news | telugu-news | mahesh kumar goud

Advertisment
Advertisment
తాజా కథనాలు