Gastrointestinal cancer: ఈ సంవత్సరాల్లో పుట్టిన వారికి క్యాన్సర్.. భారత్‌లోనే ప్రమాదం ఎక్కువ

2008 నుంచి 2017 మధ్య పుట్టిన వారికి ఏదో ఒక సమయంలో జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. సుమారు 1.5 కోట్ల మందికి తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ క్యాన్సర్ బారిన పడతారట. ఈ జాబితాలో చైనా, భారత్ వరుస స్థానాల్లో ఉన్నాయి.

New Update
Gastrointestinal cancer

Gastrointestinal cancer

మారిన జీవనశైలి వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే 2008 నుంచి 2017 మధ్య పుట్టిన వారికి ఏదో ఒక సమయంలో జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. 

ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

రెండో స్థానంలో భారత్..

సుమారు 1.5 కోట్ల మందికి తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ క్యాన్సర్ బారిన పడతారట. అయితే ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో ఉంది. మొత్తం 1.5 కోట్ల కేసుల్లో మూడింట రెండొంతులు ఆసియాలోనే సంభవిస్తాయి. మిగిలినవి అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో నమోదవుతాయి. ఆసియాలో నమోదయ్యే 1.06 కోట్ల కేసుల్లో 65 లక్షల కేసులు భారత్, చైనాలలోనే ఉంటాయని పరిశోధకులు అంచనా వేశారు. 

ఇది కూడా చూడండి:Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

185 దేశాల వివరాలను సేకరించి నిపుణులు ఈ వ్యాధిని గుర్తించారు. అయితే ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే 75 శాతం కేసులను నివారించవచ్చని సూచించారు. ప్రారంభ దశలో వ్యాధిని పసిగడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. సమస్య తీవ్రమైతే చికిత్స చేసిన ప్రయోజనం ఉండదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు