/rtv/media/media_files/2025/07/08/keeravani-father-2025-07-08-08-55-41.jpg)
Keeravani Father
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. తన తండ్రి శివశక్తి దత్త (92) హైదరాబాద్‌లో కన్నుమూశారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివ శక్తి దత్త సోదరులు అవుతారు. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఇతను 1932 అక్టోబరు 8న రాజమహేంద్రవరం జిల్లాలోని కొవ్వూరులో జన్మించారు.
ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
Music director #KeeraVani’s father, Popular Siva Sakthi Datta garu passed away.
— Suresh PRO (@SureshPRO_) July 8, 2025
He is a lyricist, poet, screenwriter, and painter.
Om Shanthi 🙏#SivaSakthiDartapic.twitter.com/IrGt9jUWOY
ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి
ఇంటి నుంచి పారిపోయి..
చిన్నతనంలోనే దత్తా ఇంటి నుంచి పారిపోయారు. ముంబై వెళ్లి ఓ ఆర్ట్స్ కాలేజీలో చదివి ఆ తర్వాత కొవ్వూరులో కమలేశ్ అనే కలం పేరుతో చిత్రకారుడిగా చేశారు. సంగీతం మీద ఉన్న ఇష్టంతో గిటార్, సితార, హార్మోనియం వంటివి కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మద్రాసు వెళ్లిపోయారు. 1988లో రిలీజైన ‘జానకి రాముడు’ సినిమాతో వీరికి మంచి పాపులారిటీ వచ్చింది.
ఇది కూడా చూడండి:Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
శివశక్తి దత్తా ఈ సినిమాకు స్క్రీన్‌రైటర్‌గా పనిచేశారు. బాహుబలి 1లో వచ్చిన మమతల తల్లి, ధీవర, బాహుబలి 2లో సాహోరే బాహుబలి, ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో కథానాయక, ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో రామం రాఘవమ్, హనుమాన్ మూవీలో అంజనాద్రి థీమ్ సాంగ్, సైలో నల్లా నల్లాని కళ్ల పిల్ల, ఛత్రపతిలో మన్నేల తింటివిరా, రాజన్నలో అమ్మా అవని వంటి పాటలకు లిరిక్స్ రాశారు. అయితే ఇతను రాసిన పాటలు అన్ని కూడా హిట్ అయ్యాయి.