BREAKING: యువతి ఫిర్యాదు.. ఆర్సీబీ బౌలర్‌పై కేసు నమోదు!

యూపీలో ఆర్సీబీ బౌలర్‌ యశ్‌ దయాళ్‌‌పై కేసు నమోదైంది. ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి లైంగిక వేధింపులు, దోపిడీ ఆరోపణలతో సీఎం గ్రీవెన్స్‌ పోర్టల్‌లో యశ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 69 కింద కేసు నమోదు చేశారు.

New Update
Yash Dayal

Yash Dayal

యూపీలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్‌ యశ్‌ దయాళ్‌‌పై కేసు నమోదైంది. ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి లైంగిక వేధింపులు, దోపిడీ ఆరోపణలతో సీఎం గ్రీవెన్స్‌ పోర్టల్‌లో యశ్ దయాళ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 69 కింద దయాళ్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఆ యువతి గతంలో యశ్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ప్రాధమిక విచారణ చేపట్టి ఇప్పుడు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి:Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

ఐదేళ్ల నుంచి రిలేషన్..

ఇదిలా ఉండగా గత 5 సంవత్సరాలుగా యష్ దయాల్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు ఆమె తెలిపింది. యష్ దయాల్ తనని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించేవాడని, కాబోయే కోడలు అంటూ నన్ను తన ఇంట్లో పరిచయం చేశాడని వెల్లడించింది. అయితే కొంత కాలం తర్వాత అతడికి ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. 

ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

దీంతో ఒకసారి మహిళా హెల్ప్‌లైన్ 181కి కాల్ చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాను. కానీ పోలీస్ స్టేషన్ నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాకు న్యాయం కోసం సీఎం గ్రీవెన్స్ పోర్టల్‌‌ను ఆశ్రయించాను. వీటన్నింటినీ నిరూపించడానికి నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపింది. ఫొటోలు, వీడియోలు, చాటింగ్‌లు, వీడియో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. యష్ దయాల్‌ను వీలైనంత త్వరగా శిక్షించాలని ఆ యువతి ఫిర్యాదు చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు