Bomb Threats : హైదరాబాద్‌లో బాంబు బెదిరింపులు...బాంబు స్క్వాడ్ షాక్‌...

హైదరాబాద్‌ లోని సిటీ సివిల్ కోర్టు , జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, రాజ్‌భవన్ తదితర ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు 3 గంటల పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

New Update
bomb threat to civil court

bomb threat to civil court

Bomb Threats :  హైదరాబాద్‌ లో బాంబులు పెట్టామంటూ వచ్చిన మెయిల్స్‌ మంగళవారం సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌ లోని సిటీ సివిల్ కోర్టు , జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, రాజ్‌భవన్ తదితర ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మూడు గంటల పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కోర్టు ఆవరణ, ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ బెదిరింపులు 'అబీదా అబ్దుల్లా' అనే పేరుతో ఉన్న మెయిల్స్ ద్వారా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో ఈ రోజు తెల్లవారుజామున 3.43 గంటలకు ఆగంతకుడు మెయిల్‌ పంపినట్టు పోలీసులు వెల్లడించారు.

Also Read : హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

Bomb Threats In Hyderabad

 నగరంలో పలు చోట్ల ఆర్డీఎక్స్, ఎల్ఈడీలు పెట్టామని, కాసేపట్లో అవి పేలిపోతాయని మెయిల్స్ రాగా.. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన పోలీసులు, లాయర్లు, ప్రజలను ఖాళీ చేయించారు. అనంతరం పోలీసుల బృందాలు 3 గంటలపాటు తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే నగరానికి తీవ్రవాదులతో ప్రమాదం పొంచి ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో హైదరాబాద్‌ వ్యా్ప్తంగా కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా నగరంలో ఆషాఢబోనాలు సాగుతుండటంతో ఆయా ఆలయాల వద్ద భద్రతను మరింత పెంచారు.

Also Read: ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి

Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

bomb-attack | crime news | crime | breaking news in telugu | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు