/rtv/media/media_files/2025/07/08/amazon-prime-day-sale-2025-2025-07-08-12-49-08.jpg)
Amazon Prime Day Sale 2025
Amazon Prime Day Sale 2025: షాపింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద సేల్ ఈవెంట్ అయిన ‘ప్రైమ్ డే సేల్ 2025’ (Amazon Prime Day Sale 2025) తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈAmazon Prime Day Sale జూలై 12వ తేదీ అర్ధరాత్రి ప్రారంభమై, జూలై 14వ తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు కొనసాగనుంది. భారతదేశంలో ప్రైమ్ డే మూడు రోజులు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
Amazon Prime Day Sale 2025
ఈ 72 గంటల మెగా సేల్‌లో అమెజాన్ ప్రైమ్ సభ్యులు ప్రత్యేకమైన డీల్స్, కొత్త ప్రొడెక్టుల లాంచ్‌లు, పరిమిత కాల ఆఫర్‌లను పొందవచ్చు. అలాగే స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, కిరాణా సామగ్రి, బ్యూటీ ప్రొడెక్టులు సహా అనేక వస్తువులపై భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. శాంసంగ్, వన్‌ప్లస్, ఐక్యూ, ఒప్పో, లావా, హానర్ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల నుంచి కొత్త ప్రొడెక్టులు కూడా ఈ సేల్‌లో విడుదల కానున్నాయి.
Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, అప్లియెన్సెస్, హెడ్‌ఫోన్‌లు, కెమెరాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, గృహోపకరణాలు వంటి అనేక వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.
Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
ఈ ఆఫర్ EMI లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి 5% క్యాష్‌బ్యాక్‌తో పాటు, అదనంగా 5% తక్షణ తగ్గింపు లభిస్తుంది. కొత్తగా ప్రైమ్ సభ్యత్వం తీసుకునేవారికి రూ. 3,000 వరకు రివార్డులు లభిస్తాయి. ప్రైమ్ సభ్యులు కాని వారికి కూడా రూ. 2,000 వరకు రివార్డులు అందుబాటులో ఉంటాయి.