/rtv/media/media_files/2025/07/08/ai-human-2025-07-08-08-11-04.jpg)
Life span with AI
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..ఇది మానవ జీవితాలను మార్చేస్తుందని తెలుసు. కానీ ఇప్పుడు ఏకంగా మనిషి మనుగడనే తీర్చిదిద్దుతుందని చెబుతున్నారు. వందేళ్ళ జీవితాల్ని మరో 50 ఏళ్ళు పెంచుతుందని చెబుతున్నారు. 2030 కల్లా మనుషుల జీవిత కాలం 150 ఏళ్లు పెంచవచ్చని శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.
రెట్టింపవనున్న మనిషి ఆయుర్దాయం..
ఇప్పటికే టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. దీని సాయంతో వైద్య రంగంలోనూ అద్భుతాలను సృష్టిస్తున్నారు డాక్టర్లు. ఎన్నో రకాల చికిత్సలను కనిపెడుతూ మనిషి ఆయుర్ధాయాన్ని పెంచుతున్నారు. గత కొన్ని దశాబ్దాలతో పోల్చితే మనుషుల సగటు జీవిత కాలం దాదాపు రెట్టింపు అయింది. ఇప్పుడు దీనికి ఏఐ తోడవనుంది. దీంతో ఐదేళ్లలో మనుషుల సగటు జీవితకాలం రెట్టింపు కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో మనుషుల జీవిత కాలం 150 ఏళ్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. మరణాన్ని జయించడం కోసం జరుగుతున్న పరిశోధనల్లో ఇదొక విప్లవాత్మక పరిణామం కానుందని అంటున్నారు.
ఆర్టిఫియల్ ఇంటలెజెన్స్...ఇప్పటికే పెను సంచనాలను సృష్టిస్తోంది. ప్రతీ రంగంలోనూ ఇది కీలక మార్పులను తెచ్చింది. ఇప్పుడు వైద్య రంగంలోనూ ఏఐ అద్భుతాలను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయిన సరికొత్త పరిష్కారాలు, చికిత్సలు, వ్యాధులకు నివారణలను ఏఐ కనిపెడుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే చాలా కేసులను ఏఐ సాల్వ్ చేసిందని అంటున్నారు. కణాల వృద్ధాప్యం , టెలోమియర్ కుంచించుకుపోవడం, క్యాన్సర్, మైటోకాండ్రియల్ లోపాలు, జన్యు అస్థిరత లేదా వృద్ధాప్యం, మరణానికి కారణమయ్యే ఇతర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయడంలో ఏఐ ఒక సూపర్ టూల్ అని పరిశోధనల్లో తేలింది. దీని ద్వారానే కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడంలో పెను మార్పులకు శ్రీకారం చుడుతుందని మార్చి 2025లో హార్వర్డ్ గెజిట్‌లో ఒక కథనం ప్రచురితమైంది.