Hyderabad: హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

HYDలోని పాతబస్తీలో సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్టు ఓ వ్యక్తి ఫోన్‌ చేయడంతో వెంటనే కోర్టు కార్యకాలాపాలు నిలిపివేశారు. పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. 

New Update
bomb threat to Hyderabad city civil court

bomb threat to Hyderabad city civil court

Hyderabad: హైదరాబాద్‌లోని పాతబస్తీలో సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు(Bomb Threat News) కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేయడంతో కోర్టు సిబ్బంది అప్రమత్తయ్యారు. వెంటనే కోర్టు కార్యకాలాపాలు నిలిపివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కోర్టులో ఉన్న లాయర్లు, ప్రజలను బయటకు పంపించేశారు. ఆపై చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. 

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

HYD Crime: Bomb Threat 

అయితే బాంబు బెదిరింపు మెయిల్‌లో సిటీ సివిల్ కోర్టుతో పాటు మరో 4 చోట్ల బాంబులు పెట్టినట్లు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్ జడ్జి క్వార్టర్స్‌లో బాంబులు పెట్టినట్లు మెయిల్‌లో తెలిపాడు. అంతేకాకుండా కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపేతుందంటూ మెయిల్‌లో పేర్కొన్నాడు. అబిదా అబ్దుల్లా పేరుతో బాంబు బెదిరింపు మెయిల్ పింపాడు. ఇక ఆగంతకుల మెయిల్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నాలుగు చోట్ల తనిఖీలు చేపట్టారు.

Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

bomb threat to Hyderabad city civil court
bomb threat to Hyderabad city civil court

Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

Advertisment
Advertisment
తాజా కథనాలు