Mobile tariff hike: మొబైల్‌ యూజ్ చేసే వారికి బిగ్ షాక్.. ఊహించని విధంగా భారీగా ధరలు పెరుగుదల

ఏడాది కింద టెలికాం సంస్థలు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టారిఫ్ ప్లాన్‌లను పెంచాలని చూస్తున్నాయి. ఈ సారి 10 నుంచి 12 శాతం వరకూ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Mobile Tariff Hike

Mobile Tariff Hike (Twitter Image)

టెలికాం కంపెనీలు మళ్లీ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలపై మరింత భారం పడనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏడాది కింద టెలికాం సంస్థలు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టారిఫ్ ప్లాన్‌లను టెలికాం సంస్థలు పెంచాలని చూస్తున్నాయి..

ఇది కూడా చూడండి:Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

10 నుంచి 12 శాతం వరకు..

ఈ సారి 10 నుంచి 12 శాతం వరకూ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇది అధిక డేటా వినియోగించే వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. జూలై 2024లోనే టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు వినియోగం మరింత పెరగడంతో అత్యధికంగా ఖర్చు చేసే వారికి బిగ్ షాక్ తగలనుందని చెప్పవచ్చు. ప్లాన్ ధరలు అందరికీ కూడా ఒకేలా పెరగవు.

ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

 టైర్ సిస్టమ్‌ ఆధారంగా వేర్వేరు ధరలు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వినియోగదారుడు ఎంత డేటా వాడుతున్నాడో, ఏ సమయంలో వాడుతున్నడానే దాని బట్టి ప్లాన్ ధరలు నిర్ణయిస్తారు. దీనివల్ల తక్కువ వినియోగదారులకు తక్కువ ఛార్జీలు, ఎక్కువ వినియోగదారులకు ఎక్కువ ఛార్జీలు ఉండేలా చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు