TG Crime: తాగుబోతు తల్లి..అడ్డొస్తుందని కూతురిని లేపేసింది

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోన్గొప్పులలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లితనాన్ని మరిచిన ఓ మహిళ తానే స్వయంగా తన ఐదు నెలల పసిబిడ్డ శివానిని గొంతు నులిమి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
pune crime news

pune crime news

TG Crime: నిజామాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లితనాన్ని మరిచిన ఓ మహిళ తానే స్వయంగా తన ఐదు నెలల పసిబిడ్డను హత్య చేసిన విషాద సంఘటన భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగోని మల్లేశ్, రమ్య దంపతులు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి శివాని అనే ఐదు నెలల బిడ్డ ఉంది. ఇటీవలి కాలంలో రమ్య మద్యానికి బానిసగా మారింది. భర్త మల్లేశ్ పలు మార్లు తాగుడును మానేయాలని చెప్పినప్పటికీ ఆమె తీరు మారలేదు. 

తాగుబోతు తల్లి చితిలో చిన్నారి బలి:

మద్యం మత్తులో ఉండే ఆమె చిన్నారి శివాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేది. దీంతో మల్లేశ్ ఓ వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహించుకోవాల్సి వస్తోంది, మరోవైపు భార్యను సర్దిచెప్పాల్సి రావడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. వారం రోజుల క్రితం ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఇరుకుటుంబాల పెద్దలు మధ్యవర్తులుగా ఉండి వారిని కలిపారు. అయినప్పటికీ పరిస్థితి మెరు గుపడలేదు. ఇద్దరి మధ్య మళ్లీ రెండు రోజుల క్రితం తీవ్ర ఘర్షణ జరిగింది. మల్లేశ్ రమ్యను తాగుడును మానుకోవాలని, బిడ్డను పట్టించుకోవాలని మందలించాడు. 

ఇది కూడా చదవండి: వర్షం వల్ల వచ్చే తేమతో దురద, చెమట సమస్య! అయితే ఈ ఆకులను నీటిలో కలిపి స్నానం చేయండి

ఈ మాటలపై ఆమె మనస్సులో కోపం పెరిగింది. తన కూతురి వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయన్న భావనతో రమ్య మానసిక స్థిరత్వాన్ని కోల్పోయింది. ఆదివారం భర్త మల్లేశ్ ఇంట్లో లేని సమయంలో శివానిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఆ దారుణ నిర్ణయంతో తల్లి తన కన్న బిడ్డ శివానిని గొంతునులిమి బలికొలిపింది. పాప శరీరాన్ని చూసిన మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రమ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటన పట్ల గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు భీమ్గల్ ఎస్సై తెలిపారు.

ఇది కూడా చదవండి: చెడు కొలెస్ట్రాల్ పెరిగిందా! కాళ్ళలో ఈ 5 లక్షణాలు ఉంటే నివారణ ఉపాయాలు తెలుసుకోండి

( Latest News | ts-crime-news | ts-crime)

Advertisment
Advertisment
తాజా కథనాలు