CRIME :  ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి

యూపీలో మైనర్ బాలిక రైల్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును రైలు వాష్ రూమ్ లో వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కన్నపేగును కాటేశాడన్న కఠిన నిజం తెలిసి జనం నివ్వెరపోయారు.

New Update
minor girl

minor girl Photograph: (minor girl)

మానవత్వం పూర్తిగా మంటగలిచిపోతుంది. వావివరుసలు మరిచి మనుషులు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ అలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక రైల్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును రైలు వాష్ రూమ్ లో వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిజం తెలిసి అందరూ షాకయ్యారు. కన్నతండ్రే కన్నపేగును కాటేశాడన్న కఠిన నిజం తెలిసి జనం నివ్వెరపోయారు.

Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్ జంక్షన్‌ లోని ఓ రైలు టాయిలెట్‌ లో ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. సమ్మర్‌ స్పెషల్‌ట్రైన్ జనరల్‌ కోచ్‌లో ఉన్న వాచ్‌రూమ్‌లో వదిలేసిన ఒక బ్యాగ్‌లో ఓ శిశువును ప్రయాణీకులు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగును క్షుణ్ణంగా పరిశీలించగా అదే బ్యాగులో ఓ సిమ్‌కార్డు కూడా దొరికింది. దాని ఆధారంగా కూపీ లాగిన పోలీసులకు నిర్ఘంతపోయే నిజాలు తెలిశాయి. ఆ నవజాత శిశువుకు జన్మనిచ్చింది మైనర్‌ బాలికగా తేలింది. అంతేకాదు ఆ బాలిక గర్భం దాల్చడానికి తండ్రే కారణమన్న కఠోర నిజం తెలిసి పోలీసులు షాక్‌ తిన్నారు. గర్భం విషయం తెలిసి  జూన్ 22న ఆ బాలిక కుటుంబం ఆమెను చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్తున్న సమయంలో ఆ బాలిక రైలు లోని వాష్‌ రూమ్‌ లో ప్రసవించింది. వెంటనే, కుటుంబ సభ్యులు నవజాత శిశువును ఒక బ్యాగ్‌ లో ఉంచి అందులోనే వదిలేశారు. ఆ తర్వాత బాలికను తీసుకొని సొంతూరికి వెళ్లిపోయారు.

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

Butcher's Father

బ్యాగులో దొరికిన బీహార్ కు చెందిన ఓ సిమ్ కార్డు ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఆ కుటుంబం బీహారలోని ఛప్రాలో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఆ తండ్రి రోజు బాగా తాగి వచ్చి బాలికను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని, ఆ తర్వాతే ఆమె గర్భవతి అని తెలిసింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి రాకుండా..-- చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్తుండగా రైల్లోనే ప్రసవించినట్లు నిర్ధారించారు. పోషించే స్తోమత లేకపోవడంతో ఆ శిశువును కుటుంబం వదిలేసి వెళ్లింది. అయితే నిందితులను పట్టుకొన్న పోలీసులు  కేసు నమోదు చేశారు. అత్యాచార బాధితురాలిని మొరాదాబాద్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఆమెను కేంద్ర మహిళా- శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పిల్లల చైల్డ్‌లైన్ అధికారులకు అప్పగించారు.

Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

బిడ్డను పోషించలేనని ఆమె లిఖితపూర్వకంగా రాసి ఇచ్చింది. ఆమెతో పాటు ఆమె తల్లి, తల్లి తరఫు అమ్మమ్మ కూడా వచ్చారు. వారు కూడా అదే విషయం చెప్పారని నివేదిక పేర్కొంది.ప్రస్తుతానికి, ఆ మగబిడ్డ మొరాదాబాద్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్ద ఉన్నాడని, దాని చీఫ్ అమిత్ కౌషల్ తెలిపారు. శిశువును వెంటనే దత్తతకు ఇవ్వరు! ఆ ప్రక్రియ రెండు నెలల తర్వాత ప్రారంభమవుతుంది. ఆ సమయంలో బాధితురాలు పునరాలోచించుకుని శిశువు కస్టడీని క్లెయిమ్ చేసుకోవచ్చని సంక్షేమ కమిటీ అధికారి తెలిపారు.

Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

Uttar Pradesh | bihar | pregnant | minor-girl | Minor Girl Rape | minor rape | minor girl incident | minor girl case | minor child incident | minor child | minor | mother | father

Advertisment
Advertisment
తాజా కథనాలు