KTR : రేవంత్‌ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్‌ కీలకవ్యాఖ్యలు

మాట తప్పడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌రెడ్డికి రచ్చ చేయటమే తప్చ చర్చ చేయటం రాదని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కి రావాలని తాను సవాల్ చేస్తే రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

New Update
ktr vs revanth reddy

ktr vs revanth reddy

మాట తప్పడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రచ్చ చేయటమే తెలుసు.. చర్చ చేయటం రాదని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కి రావాలని తాను సవాల్ చేస్తే రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చర్చకు సిద్ధమంటూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన కేటీఆర్‌ ఇవాళ ఉదయం ప్రెస్‌క్లబ్‌ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులపై చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి కోసం తాను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌‌లో వేచి చూస్తున్నానని స్పష్టం చేశారు. తనతో చర్చకు రాకుండా.. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. తాను చెప్పినట్లుగానే చర్చకు వచ్చానని.. రేవంత్‌రెడ్డి ఎక్కడంటూ మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. గత 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలన తో  రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు-.నోటికొచ్చిన హామీలు,  నోటికి వచ్చిన వచ్చిన వాగ్దానాలు, 420 హామీలు, వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి  గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు మాది గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద రాసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేకపోయాడన్నారు.

తెల్లారి లేస్తే అరుపులు, గావుకేకలు, బూతులు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి సవాల్‌ విసిరితే స్వీకరించి నేను వచ్చాను. రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జి లేదని తెలిసినా కూడా ముఖ్యమంత్రి ముచ్చట పడుతున్నాడు కదా అని సవాల్ ను స్వీకరించానన్నారు.  నాలెడ్జ్ లేదు కాబట్టే 72 గంటల టైం ప్రిపరేషన్ కోసం ఇచ్చి రమ్మన్నాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పాను. జులై 8 తారీఖున 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్ కు వస్తాము, మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే ఇవాళ రేవంత్ రాకుండా ఢిల్లీకి పోయిండని కేటీఆర్‌ విమర్శించారు. 

ఒకవేళ ముఖ్యమంత్రి  రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గాని, వ్యవసాయ మంత్రి గానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులను పంపుతారని అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు కాని చర్చ చేయడం రాదని ఇవాళ తేలిపోయిందన్నారు. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది కానీ రైతుల గురించి మాట్లాడడం రాదని స్పష్టంగా తెలిసిపోయిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి బేసిన్ ల గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ లేదు. ఏ ప్రాజెక్టు బేసిన్లో ఉంది అని  ఇరిగేషన్ అధికారులను ఒక చిన్న పిలగాడు అడిగినట్లు అడుగుతుంటే ఇతనా  మనకు న్యాయం చేసేదని రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్నారన్నారు.

Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

KTR v/s Revanth Reddy

ప్రొఫెసర్ జయశంకర్ గారు , కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రాతిపదికను కల్పించారు. ఈ సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వాడుతున్నాడన్నారు. తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతులను మోసం చేస్తూ ఆయన గురువు చంద్రబాబుకు కృష్ణా గోదావరి నీళ్లను పంపిస్తున్నాడు. కింద గోదావరిలో బనకచర్ల కడుతుంటే పచ్చ జెండా ఊపుతున్నడని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకొని చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నాడని కేటీఆర్‌ మండిపడ్డారు. 

నీళ్లేమో ఆంధ్రకు పోతున్నాయి. నిధులు ఢిల్లీకి పోతున్నాయి. తన తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని రేవంత్ మురిసిపోతున్నాడు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు  కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోసి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నాడన్న సంగతి ఇవాళ తెలంగాణలోని చిన్న పిల్లలకు కూడా తెలుసు. తెలంగాణ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి పేసిఎం అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని ఏ వర్గానికి రేవంత్ రెడ్డి మేలు చేయలేదు. రైతు భరోసాలోని డొల్లతనాన్ని చెబుదామని అధికారిక సమాచారంతో వచ్చా. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో రైతు భరోసా రాని 670 మంది రైతుల పేర్లు, అడ్రస్సులు, ఫోన్ నెంబర్లతో సహా తీసుకొని వచ్చాను. రాష్ట్రంలో రుణమాఫీ కానీ లక్షల మంది వివరాలతో జాబితా తీసుకొచ్చాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న 670 మంది రైతుల వివరాల మా దగ్గర ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితాను తీసుకొని వచ్చానన్నారు.

Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది. ఒక్క ఆధార్ కార్డుతో ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా ఇస్తామంటే చెప్పులను క్యూలో పెట్టి రైతులు ఫర్టిలైజర్ దుకాణాల ముందు ఎదురుచూస్తున్నారు. మళ్లీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్ధినాలను తీసుకొచ్చింది. కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ఆనాటి రోజులు మళ్లీ ఇప్పుడు వచ్చాయి. ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడే ఆనాటి రోజులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అణిచివేతలు, నిర్బంధాలు అని తెలుసుకున్నారు. 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ ని తలపించేలా ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతుంది. పేదలు, గిరిజనులు, దళితుల మీద దాడులు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును రీ ట్వీట్ చేసినందుకు నల్లబాలు అనే బహుజన బిడ్డను రేవంత్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందన్నారు.

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది.ఆనాటి రోజులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూస్తున్నారు. మార్పు అంటే ఇంత దారుణంగా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ హోంమంత్రి, మాజీ అడిషనల్ డీజీపీ ఇంకా ఎందరో బీఆర్ఎస్ నేతలు, నాయకులు, ఎంపీలు, అందరు ముఖ్యమంత్రి గారి కుర్చికి చాలా గౌరవాన్ని ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఆ గౌరవాన్ని నిలుపుకునేలా లేడు. ఆయన చేప్పే పిచ్చి మాటలు, చేసే రోత చేష్టలను తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. కేసీఆర్‌ను ప్రతిరోజు ఎలా తిడుతున్నారో ప్రపంచమంతా చూస్తోంది. 2018 లోనూ కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరిండు కానీ ఆ తర్వాత మాట మార్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిండు.

జీహెచ్ఎంసీ లో బీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు. సవాల్ విసిరిండు. పారిపోయిండు. చర్చకు రమ్మని స్వయంగా ముఖ్యమంత్రే పిలిస్తే నేను వచ్చిన. కానీ, ఇప్పుడు ఆయనే పత్తా లేకుండా పారిపోయిండు. రైతు శ్రేయస్సు మీద, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అంటే సమగ్ర సమాచారంతో మేము వచ్చాము. ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు. అందుకే ఆయనకు మరొక అవకాశం ఇస్తున్నాను. ప్లేసు, డేటు ,టైము, మీరు డిసైడ్ చేయండి. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా వస్తాము. ఏ అంశం మీద చర్చ పెట్టినా చర్చించడానికి కేసీఆర్ తయారుచేసిన గులాబీ దండు సైనికులం తయారుగా ఉన్నామని మరోసారి సవాల్‌ విసిరారు.

సోషల్ మీడియాలో పిల్లలు పోస్టులు పెడితేనే రేవంత్ రెడ్డి గజ గజ వణికిపోతున్నాడు. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నాడు. ఆయనకు కేసీఆర్ కావాలా? రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరం లేదు. నేనే కాదు మా పార్టీలో ఏ నాయకుడైనా రేవంత్ రెడ్డికి సరిపోతారన్నారు. కానీ ఆయన ముచ్చటపడి పేరు తీసిండని నేను వచ్చాను. మైక్ ఇవ్వకుండా అసెంబ్లీలో టైం పాస్ చేస్తానంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. చర్చకు రాలేక పోతే ముక్కు నేలకు రాసి కెసిఆర్ కి క్షమాపణ చెప్పు. తప్పుడు కూతల కూసినందుకు,  రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాన్ని తెచ్చిన మహా నాయకుడు కేసీఆర్ ను,  భారత దేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంటు ఇచ్చిన కేసీఆర్ ను అడ్డగోలుగా తిట్టినందుకు ముక్కు నెలకు రాయాలి. చర్చకు వచ్చే దమ్ము లేదు. కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి క్షమాపణ చెప్పు. అంతేగాని ఇలాంటి పనికిమాలిన సవాళ్లు పనికిమాలిన డైలాగులు ఇంకొకసారి చెప్పకు అంటూ కేటీఆర్‌ రేవంత్‌ రెడ్డికి సూచించారు.

Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

rythu barosa | hyderabad | ktr vs revanth reddy | ktr vs congress | ktr vs cm revanthreddy | BRS vs Congress

Advertisment
Advertisment
తాజా కథనాలు