BREAKING: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. నుజ్జునుజ్జైన బస్సు

తమిళనాడులో స్కూల్‌ వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Tamilnadu

Tamilnadu

తమిళనాడులో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కడలూరు జిల్లా సెమ్మంగుప్పంలో స్కూల్‌ వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రైలు వెళ్తున్నప్పుడు రైల్వే గేటు మూసివేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

ఇది కూడా చూడండి:Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

ఏపీలోనూ..

ఇదిలా ఉండగా ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుండగా.. భారీ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని శివగావ్‌ అహ్మదానగర్‌కు చెందిన నలుగురు యువకులు శ్రీకర్, తుషార్, కార్తీక్‌, సుమిత్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. అలా వస్తున్న క్రమంలో మంగళవారం వేకువజామున 2గంటల దాటిన తర్వాత అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద నేషనల్ హైవేపై కారు అదుపుతప్పింది. 

ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

అనంతరం ఆ కారు రోడ్డుపై బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న నలుగురిలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. శ్రీకర్, తుషార్, కార్తీక్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొక యువకుడు సుమిత్ తీవ్రంగా గాయపడగా.. అతడిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జు అయింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు