/rtv/media/media_files/2025/07/08/attack-on-kovur-ex-mla-nallapareddy-prasanna-kumar-reddy-house-2025-07-08-06-42-21.jpg)
attack on kovur ex mla nallapareddy prasanna kumar reddy house
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం (జూలై 7) రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరు నగరంలోని సావిత్రినగర్‌లో ఉన్న ఆయన ఇంటిలోని ఫర్నీచర్‌తో పాటు వాహనాలను ధ్వంసం చేశారు.
EX MLA Prasanna Kumar Reddy
దాడికి కారణాలు:
అందుతున్న సమాచారం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కొందరు గుర్తుతెలియని దుండగులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి వీరంగం సృష్టించినట్లు సమాచారం. అయితే కొందరు ఈ దాడిని టీడీపీ శ్రేణులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు చేశారని ఆరోపిస్తున్నారు.
ఫర్నీచర్, కారు ధ్వంసం
ఈ దాడిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిలోని ఫర్నీచర్, కారుతో పాటు ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరని సమాచారం. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.
వైసీపీ నేతలు ఫైర్:
దాడి జరిగిన వెంటనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు వైసీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ దాడికి బాధ్యులని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ దాడికి కారణమైన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.