Trump Tariffs: జపాన్, కొరియాలకు వాయింపు..భారత్ తో ఒప్పందానికి సానుకూలం

అమెరికా అధ్యక్షుడు మళ్ళీ టారీఫ్ ల గోల మొదలెట్టారు. తమతో ఒప్పందం చేసుకోని జపాన్, కొరియాలతో సహా 14 దేశాలపై 25 శాతం సుంకాలు విధించారు. భారత్ తో మాత్రం అగ్రిమెంట్ కు సానుకూలంగా ఉన్నట్టు సూచనలిచ్చారు.

New Update
tt

Trump Tariffs

సుంకాల విషయంలో ఎప్పటికైనా తగ్గేదేలేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తమతో రాజీకి రాకపోతే వాయింపు తప్పదని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఒక లేఖ ను విడుదల చేశారు. దీని ప్రకారం జపాన్, ఆసియాలతో పాటూ పద్నాలుగు దేశాలపై 25 శాతం సుంకాల మోత మోగించారు. ఆగస్టు 1 నుంచి ఈ టారీఫ్ లు అమలు అవుతాయని తెలిపారు. రెండు దేశాల నేతలను ఉద్దేశిస్తూ రాసిన లేఖలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రతీకార సుంకాలు పెంచితే కనుక జపాన్, కోరియాల ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు దెబ్బతింటాయని హెచ్చరించారు. దాంతో పాటూ మిగతా దేశాల టారీఫ్ ల బ్రేక్ కూడా ఆగస్టు 1 వరకూ పెంచారు. 

భారత్ తో ఒప్పందానికి సానుకూలం..

అన్ని దేశాలతో పాటూ భారత్ కు కూడా సుంకాల గడువు పెంచడంతో చర్చలకు మరి కొంత సమయం దొరికినట్టయింది. మరోవైపు తాము భారత్ తో ఒప్పందానికి రెడీగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సానుకూల సంకేతాలిచ్చారు. ఈ బుధవారం లోగా రెండు దేశాల మధ్యనా మధ్య ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది. 

అంతకు ముందు భారత్ తో సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించారు. కెనడా, చైనాలపై అన్నిటి కంటే ఎక్కువ టారీఫ్ లను విధించారు. కానీ మిగతా దేశాలకు మాత్రం 26 శాతం సుంకాలను వేస్తామని చెప్పారు. దీంతో చాలా పెద్ద గొడవ జరిగింది. భారత్ తో సహా అన్ని దేశాలు ఈ ప్రతీకార సుంకాలను ఒప్పుకోలేదు. చైనా అయితే తిరిగి అంతే సుంకాలను విధించింది. దీంతో వాణిజ్య యుద్ధానికి తెర లేచింది. ఇది సద్దు మణగడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుకాలకు బ్రేక్ ఇచ్చారు. 90 రోజుల పాటూ వాటికి నిలిపివేస్తున్నట్టు చెప్పారు. 

ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

Advertisment
Advertisment
తాజా కథనాలు