/rtv/media/media_files/2025/07/08/anantpuram-road-accident-three-young-men-dead-2025-07-08-07-12-08.jpg)
anantpuram road accident three young men dead
రోజు రోజుకీ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిపోతుంది. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో అమాయకులు కూడా వారి నిర్లక్ష్యానికి బలవుతున్నారు. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు.
Also Read: ఇస్రో ఛైర్మన్‌తో స్పేస్ నుంచి శుభాంశు శుక్లా ఫోన్ సంభాషణ.. ఏం మాట్లాడారంటే ?
ఘోర రోడ్డు ప్రమాదం
తాజాగా ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుండగా.. భారీ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: అమ్మో.. రామాయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?
మహారాష్ట్రలోని శివగావ్ అహ్మదానగర్‌కు చెందిన నలుగురు యువకులు శ్రీకర్, తుషార్, కార్తీక్, సుమిత్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. అలా వస్తున్న క్రమంలో మంగళవారం వేకువజామున 2గంటల దాటిన తర్వాత అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద నేషనల్ హైవేపై కారు అదుపుతప్పింది.
Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..
అనంతరం ఆ కారు రోడ్డుపై బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న నలుగురిలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. శ్రీకర్, తుషార్, కార్తీక్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొక యువకుడు సుమిత్ తీవ్రంగా గాయపడగా.. అతడిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జు అయింది.