Khammam Crime: మామ, కోడలు శృంగారం.. కూతురు చూడటంతో చంపేశారు - కోర్టు సంచలన తీర్పు

కన్న కూతుర్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన కేసులో తల్లితోపాటు ఆమె మామకూ ఖమ్మం కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి న్యాయస్థానంలో జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్‌ సోమవారం తీర్పు చెప్పారు.

New Update
videotaping married woman taking bath (1)

khammam mother killed her daughter court gets life imprisonment

Khammam Crime: భర్త పనిమీద బయటకు వెళ్లాడు. దీంతో మామ - కోడలు శృంగారంలో మునిగితేలుతుండగా.. కూతురు చూసింది. ఈ విషయం తన తండ్రికి ఎక్కడ చెప్పేస్తుందోనని.. తల్లి, తన మామతో కలిసి కన్న కూతుర్ని చంపేసింది. ఈ కేసులో కోర్టు తాజాగా సంచలన తీర్పునిచ్చింది. కన్న కూతుర్ని అత్యంత కర్కశంగా హత్య చేసినందుకు గానూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి న్యాయస్థానం మామ, కోడలుకి జీవిత ఖైదు విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

ఏం జరిగిందంటే?

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు (65) కొడుకు హరికృష్ణకు, సునీత(32)కు గతంలో మ్యారేజ్ అయింది. వీరికి 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే సునీత, తన మామ నరసింహారావుతో కొంతకాలం క్రితం వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలా వీరి వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఇందులో భాగంగానే 2022, ఫిబ్రవరి 8న సునీత భర్త హరికృష్ణ పనిమీద బయటకు వెళ్లాడు. 

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

దీంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మామ, కోడలు కలిసి శృంగారంలో మునిగితేలారు. అదే సమయంలో సునీత కూతురు వారిని చూసింది. దీంతో ఈ విషయం తన భర్తతో పాటు, బయటవారికి తెలిసిపోతుందని భావించిన సునీత.. తన మామతో కలిసి కన్న కూతుర్ని హత్య చేసింది. కాళ్లు చేతులు కట్టి వైరుతో గొంతునులిమి చంపేసింది. 

Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

అయితే ఈ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి విషయం పోలీసుల వరకు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఈ కేసులో తన మామతో అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు సునీత మరో ప్లాన్ వేసింది. తనకు ఓ యువకుడితో ఎఫైర్ ఉందని.. అతడే తన కూతురిని చంపాడని పోలీసులను నమ్మించింది. 

పోలీసులు ఆ యువకుడ్ని విచారించగా.. సునీతతో ఎఫైర్ ఉండటం నిజమే కానీ.. ఆమె కూతుర్ని తాను చంపలేదని చెప్పాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా సునీత మొత్తం చెప్పేసింది. దీంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి న్యాయస్థానంలో జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్‌ ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు, మృతురాలి మెడికల్ రిపోర్టు పరిశీలించిన అనంతరం వారికి జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు