/rtv/media/media_files/2025/02/16/URr4eiYxCtN9zGeCTVcx.jpg)
Harish rao
మాజీ మంత్రి హరీశ్ రావుకు కాళేశ్వరం కమిషన్ మరోసారి నోటీసులు పంపింది. గత నెల విచారణకు హరీశ్ రావు హాజరు కాగా.. మరోసారి నేడు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన విషయాలపై జస్టిస్ పీ చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను కూడా విచారించింది. ఈ క్రమంలోనే మళ్లీ హరీశ్ రావును విచారించనుంది.
ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
మాజీ మంత్రి హరీశ్ రావుని మరోసారి కాళేశ్వరం కమిషన్ నోటీసులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 8, 2025
ఇదివరకే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒకసారి ఆయన్ను విచారించిన కమిషన్..
మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన వైనం
కేసీఆర్తో భేటీ అయ్యాక.. కమిషన్ ముందు హాజరుకానున్న హరీశ్ రావు#HarishRao#Kaleshwaram… pic.twitter.com/oCmeaA0zKe
ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి
గత నెల కూడా విచారించగా..
ఇదిలా ఉండగా జూన్ 9వ తేదీన హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బీఆర్కే భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఆయన్ని 45 నిమిషాల పాటు ప్రశ్నించింది. దాదాపు 20 ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏయే ప్రశ్నలు అడిగారనే విషయాన్ని వెల్లడించారు. తుమ్మిడిహెట్టి నుంచి కాలువలు తవ్వకుండా ఎక్కడి నుంచో ఎందుకు తవ్వారని కాళేశ్వరం కమిషన్ అడిగినట్లు ఆయన చెప్పారు.
ఇది కూడా చూడండి:Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 5సార్లు మీటింగ్‌లు జరిగాయని, ఆ మీటింగ్స్ సారాంశాన్ని మొత్తం కమిటీకి వివరించానని హరీశ్ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లులేని చోట ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసిందని.. దీంతో నీళ్లు ఉన్న చోటుకు ప్రాజక్ట్ డిజైన్ మార్చామని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజక్ట్‌కు కేబినెట్ ఆమోదం ఉందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదీ నోటి మాటగా చెప్పలేదన్నారు. కేసీఆర్ స్వయంగా ముంబైకు వెళ్లి అడిగినా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని హరీశ్ రావు కమిషన్‌కు చెప్పినట్లు మీడియాకు తెలిపారు.