/rtv/media/media_files/2025/07/08/pawan-kalyan-serious-warning-to-ycp-ex-mla-nallapureddy-prasanna-kumar-reddy-2025-07-08-13-49-29.jpg)
pawan kalyan serious warning to ycp ex MLA Nallapureddy prasanna kumar reddy
Pawan Kalyan: వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.
పవన్ కళ్యాణ్ హెచ్చరిక
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన మండిపడ్డారు. అలాంటి అదుపులేని భాష వాడే నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
గతంలో వైసీపీ పాలనలో ఇలాంటి అసంబద్ధ భాష వాడటం వల్లే వారు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారని గుర్తు చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడే వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని, వైసీపీ నాయకులు ఇలాంటి చెడు సంప్రదాయాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి
ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణలు
తన ఇంటిపై దాడి తనను హతమార్చడానికే అని ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను ఇంట్లో ఉండి ఉంటే కచ్చితంగా చంపేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ ఇలాంటి దాడులు సరికాదని అన్నారు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదని, తాను చేసిన ప్రతి వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్