🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

BIG BREAKING: ఏపీ ఇన్ఛార్జ్ CMగా పవన్.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 26-30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 4రోజుల పాటు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Pawan Kalyan
Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో ఈ 4 రోజులు ఆయన స్థానంలో పవన్ కళ్యాణ్‌కు ఇన్‌ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. 

Also Read: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌‌ఫోన్.. కెమెరా సూపరెహే!

Pawan Kalyan

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సింగపూర్‌కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌ను నియమించారు. 

Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది:

పవన్ కళ్యాణ్‌కు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ.. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

జనసైనికుల్లో ఆనందం

పవన్ కళ్యాణ్ ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సామర్థ్యం, పరిపాలనా దక్షతను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని జనసేన నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. 

  • Jul 15, 2025 21:42 IST

    సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

    సమోసా, జిలేబీలో కొవ్వు, చక్కెర, నూనె శాతం ఎంత ఉందని తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలనే న్యూస్ ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ పీబీఐ తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం సూచనలు మాత్రమే చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    samosas



  • Jul 15, 2025 21:01 IST

    కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కీలక పరిణామం... మాజీ ఈఎన్‌సీ మురళీధరరావు అరెస్ట్‌

    కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహారించిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌) మురళీధరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

    Muralidhar Rao



  • Jul 15, 2025 20:28 IST

    సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ

    ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి ఛైర్మన్‌గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల ఎపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఇద్దరు సీఎంలకు పిలుపువచ్చింది.

    Discussions with the Center on Godavari projects



  • Jul 15, 2025 19:06 IST

    ఎమ్మెల్యేపై వాటర్‌ బాటిల్‌తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..

    క్యూన్యూస్‌ కార్యాలయంపై దాడి నేపథ్యంలో గన్‌మెన్‌ కాల్పులు జరిపిన ఘటన మరవకముందే మరో గన్‌మెన్ ఫైర్‌ ఓపెన్‌ చేసేందుకు సిద్ధపడ్డ ఘటన కలకలం సృష్టించింది. చివరినిమిషంలో గన్‌మెన్‌ తన ప్రయత్నాన్ని విరమించుకోవడంతో మరో ఫైరింగ్‌ ఘటన తప్పిందన్న  ప్రచారం సాగుతోంది.

    MLA attacked with water bottle..



  • Jul 15, 2025 18:13 IST

    భట్టికి బిగ్‌ షాక్‌..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్‌ నోటీసులు

    తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టికి బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు పరువు నష్టానికి సంబంధించి లీగల్‌ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు లీగల్ నోటీసు జారీ చేశారు.

    Ramchander Rao vs Mallu Bhatti Vikramarka



  • Jul 15, 2025 17:59 IST

    రాహుల్‌ గాంధీకి బిగ్ రిలీఫ్.. బెయిల్‌ మంజూరు

    భారత్‌ జోడోయాత్రలో భాగంగా 2022లో భారత ఆర్మీని రాహుల్ గాంధీ కించపరిచారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఆయనకు లక్నో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

     

    Rahul Gandhi
    Rahul Gandhi

     



  • Jul 15, 2025 17:46 IST

    అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ

    అమెరికాలో ఆకస్మికంగా సంభవించిన భారీ వరదల వల్ల న్యూయార్క్, న్యూజెర్సీలో మొత్తం ప్రజా జీవనం స్తంభించిపోయింది. రోడ్లు, ఎయిర్‌పోర్టులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ కరోలినాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.

     

    America Floods
    America Floods

     

     

     

     

     

     



  • Jul 15, 2025 17:41 IST

    సోషల్‌ మీడియా పోస్టులపై సుప్రీం కీలక ఆదేశాలు..ఇక దబిడి దిబిడే..

    సోషల్‌ మీడియాలో కొందరు యూట్యూబర్లు, స్టాండప్‌ కమెడియన్లు, కళాకారులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని సుప్రీం కోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

     

    Supreme Court
    Supreme Court

     

     

     



  • Jul 15, 2025 17:33 IST

    లోయలో పడిన టెంపో.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి

    జమ్మూ కాశ్మీర్‌లో టెంపో వాహనం అదుపు తప్పి లోయలో పడిన ప్రమాద ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

     

    Jammu kashmir
    Jammu kashmir

     



  • Jul 15, 2025 17:32 IST

    భూమిపైకి శుభాంశు శుక్లా.. అంతరిక్షంలో 60 రకాల ప్రయోగాలు

    యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్‌ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది. శుక్లా నేతృత్వంలోని టీమ్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది.

     

    Shubhanshu Shukla
    Shubhanshu Shukla

     



  • Jul 15, 2025 17:32 IST

    నా భర్తను చంపినవాళ్లను నేనే చంపేస్తా : చందు నాయక్ భార్య సంచలన వ్యాఖ్యలు

    మలక్ పేట్‌లోని శాలివాహన పార్క్‌లో  సీపీఐ నాయకుడు చందునాయక్‌ ను ప్రత్యర్థులు ఈ ఉదయం కాల్చి చంపిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై చందు నాయక్ భార్య నారి భాయ్ హాట్ కామెంట్స్ చేశారు. నా భర్తను చంపిన వాళ్లను నేనే చంపుతానని తన ఆవేదనను వెల్లడించారు.

    I will kill those who killed my husband: Chandu Naik's wife



  • Jul 15, 2025 17:31 IST

    ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

    ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.

     

    Dheeraj Kumar passed away
    Dheeraj Kumar passed away

     



  • Jul 15, 2025 17:31 IST

    జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?



  • Jul 15, 2025 16:11 IST

    తెలంగాణలో పెరుగుతోన్న గన్‌ కల్చర్..భయాందోళనలో జనం

    తెలంగాణలో గన్‌ కల్చర్‌ పెరుగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కాల్పుల ఘటనలో ప్రజలు .భయాందోళనకు గురవుతున్నారు. అక్రమ ఆయుధాలతో ప్రత్యర్థులపై దాడి చేస్తున్న ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్, మెదక్‌ లో జరిగిన కాల్పుల ఘటనలు కలకలం రేపాయి.



  • Jul 15, 2025 16:11 IST

    ఆకాశాన్ని తాకుతున్న టెస్లా ధరలు.. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఎందుకు ఎక్కువ?

    అమెరికాలో టెస్లా కారు ధర రూ.38.63 లక్షలు ఉండగా, ఇండియాలో రూ.61.07 లక్షలకి విక్రయించనున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే భారత్‌లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం అధిక దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు దేశంలో తయారు అయితే వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.

     

    Tesla Cars
    Tesla Cars

     



  • Jul 15, 2025 15:39 IST

    జల్సాలకు అలవాటు పడిన కొడుకు.. చంపి పాతిపెట్టిన తండ్రి!

    జల్సాలకు అలవాటు పడ్డాడడని కొడుకును చంపి పాతరేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన  పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో చోటుచేసుకుంది.

     

    CRIME
    CRIME Photograph: (CRIME)

     



  • Jul 15, 2025 15:26 IST

    షార్జాలో కేరళ తల్లీబిడ్డల మృతి...భర్త కుటుంబానికి బిగ్ షాక్‌

    కేరళలోని కొల్లంకు చెందిన 21 ఏళ్ల భారతీయ మహిళ విపంచిక షార్జాలో ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మృతికి కారణంగా భావిస్తూ భర్త కుటుంబం పై కేసు నమోదు చేశారు. విపంచిక భర్త నితీష్, ఆడపడుచు నీతు, మామ మోహనన్‌పై కేసు నమోదు చేశారు.



  • Jul 15, 2025 15:26 IST

    భూమిపై ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా

    యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్‌ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది. 

     

    Shubhanshu Shukla
    Shubhanshu Shukla

     



  • Jul 15, 2025 15:25 IST

    భార్య చికెన్ తినలేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య

    తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.

     

    Husband Commits Suicide after his wife refuse to eat chicken in Tamil Nadu
    Husband Commits Suicide after his wife refuse to eat chicken in Tamil Nadu

     



  • Jul 15, 2025 15:25 IST

    పవన్ కళ్యాణ్- శ్రీలీల సీన్ లీక్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్!

    హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన పవన్ కళ్యాణ్, శ్రీలీల విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ సన్ గ్లాసెస్, టీ షర్ట్- జీన్స్ ధరించి స్టైలిష్ గా కనిపించారు. 



  • Jul 15, 2025 14:33 IST

    దర్శకుడు పా. రంజిత్ పై కేసు

    తమిళ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న "వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టెంట్ చేస్తూ మృతి చెందాడు. దీంతో చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజ్ మృతి చెందాడని పా. రంజిత్, సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

     

    police case against Pa Ranjith
    police case against Pa Ranjith

     



  • Jul 15, 2025 13:57 IST

    Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

    నిమిష ప్రియకు జులై 16యెమెన్‌లో మరణశిక్ష విధించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె మరణశిక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

     

    Nimisha Priya
    Nimisha Priya

     



  • Jul 15, 2025 13:37 IST

    బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపు

    మ‌హారాష్ట్ర‌ ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఈ-మెయిల్ ద్వారా అక్కడ భారీ పేలుడు సంభవిస్తోందని బెదిరింపు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ఐడీ కేరళ సీఎం కామ్రేడ్ పిన‌ర‌యి విజ‌య‌న్ పేరుతో ఉందట.

    bomb threat email



  • Jul 15, 2025 13:37 IST

    Syria Clashes: సిరియాలో మారణహోమం ఇప్పటిది కాదు.. 2011 నుంచి ఆగని చావులు

    2011లో "అరబ్ స్ప్రింగ్" ప్రజాస్వామ్య ఉద్యమాలు మధ్యప్రాచ్యాన్ని చుట్టుముట్టాయి. సిరియాలో కూడా అప్పటి అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ నియంతృత్వ పాలన, కుటుంబ పాలన, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు ప్రారంభించారు.

    Syria clashes civil war



  • Jul 15, 2025 11:34 IST

    Tesla showroom: ఇండియాలో మొదటి టెస్లా షోరూం ఓపెన్.. అదిరిపోయే ఈ-కార్లని చూడండి (VIDEO)

    ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా, ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. జూలై 15 (మంగళవారం) ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి CM దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు.

    Tesla



  • Jul 15, 2025 11:33 IST

    పాత రూ.2వేల నోట్లు తీసుకొని.. అక్కడ రూ.1200, రూ.1600 ఇస్తున్నారు

    భారతదేశంలో రూ. 2వేల నోట్ల ఉపసంహరణ తర్వాత, నేపాల్ సరిహద్దు ప్రాంతాలలో అవి చలామణి అవుతున్నాయని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తులో తేలింది. రూ.2వేల నోట్లు తీసుకొని వాటికి బదులుగా రూ.1200 నుంచి రూ.1600 వరకు ఇస్తున్నట్లు సమాచారం.

    Indian two thousand notes



  • Jul 15, 2025 11:32 IST

    Marathon Runner Fauja Singh: 114ఏళ్ల వయసులో ఫౌజా సింగ్ మృతి.. ఈయన గురించి తెలిస్తే షాక్!

    ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా పేరుగాంచిన ఫౌజా సింగ్ (114) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బియాస్‌లో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పౌజా సింగ్ పేరు మీద ఎన్నో ప్రపంచ రికార్డులు ఉన్నాయి.

    Fauja Singh



  • Jul 15, 2025 11:32 IST

    BIG BREAKING: హైదరాబాద్‌‌లో కాల్పుల కలకలం.. ‘వ్యక్తి స్పాట్‌డెడ్’

    హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్క్‌లో వాకర్స్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై తుపాకీతో ఫైరింగ్ చేశారు.

     

    firing in hyd
    firing in hyd Photograph: (firing in hyd)

     



  • Jul 15, 2025 11:31 IST

    TRUMP: ట్రంప్ మాస్టర్ ప్లాన్.. టమోటాలపై అమెరికా 17శాతం ట్యాక్స్

    అమెరికా ప్రభుత్వం మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% సుంకాన్ని విధించింది. టమాటా దిగుమతులపై సుంకం విధించకుండా అడ్డుకునేందుకు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా టమాటో ఉత్పత్తి పెంచాలని అమెరికా ఇలా చేసింది.

    trump with tomato



  • Jul 15, 2025 11:30 IST

    Ukraine: బిగ్ ట్విస్ట్.. ప్రపంచంలోనే మొదటిసారి యుద్ధరంగంలోకి రోబోలు

    ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్‌లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి. యుద్ధ రంగంలో రోబోలు, డ్రోన్ల ద్వారా రష్యా బలగాలను నిర్బంధించినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి.

    ukraine using robots in war



  • Jul 15, 2025 07:35 IST

    K-RAMP Glimpse: ది రిచెస్ట్ చిల్లర్.. 'K-Ramp' గ్లింప్స్ రిలీజ్.. ఆ బూతులు ఏంది సామి!

    కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం 'కె-ర్యాంప్' నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మాస్ లుక్, ఫన్నీ, అడల్ట్ డైలాగ్స్‌తో కిరణ్ ఎంటర్‌టైన్ చేశాడు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.

     

    K-Ramp Glimps Release
    K-Ramp Glimps Release

     



  • Jul 15, 2025 07:35 IST

    Cyber Attacks On India: జాగ్రత్త.. నెలకు రూ.1000 కోట్లు కాజేస్తుండ్రు

    ఇండియాపై సైబర్ అటాక్స్ ఎక్కువగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ అంచనా వేసింది. 2025లోని మొదటి 5 నెలల్లో భారత్‌లో దాదాపు రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నది. దేశంలో ప్రతి నెలా రూ.1,000 కోట్లు నష్టపోతున్నారని తేలింది.

    cyber attacks on india



  • Jul 15, 2025 07:34 IST

    AP Forest Department Jobs: ఏపీ అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. పోస్టులు, అర్హత, చివరితేదీ వివరాలివే

    ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఏపీలోని అటవీశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు.

     

    AP Forest Department Jobs
    AP Forest Department Jobs

     



  • Jul 15, 2025 07:34 IST

    Ind Vs Eng: సిరాజ్ షాకింగ్ ఔట్..ఓటమి నిరాశలో భారత్..

    లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది. గెలుపు ముంగిట వరకు వచ్చి ఓడిపోయింది. చివరి వికెట్ సిరాజ్ అనూహ్యంగా అవుట్ అవడంతో భారతజట్టు నిరాశలో మునిగిపోయింది. 

     

    siraj
    Siraj Out

     



  • Jul 15, 2025 07:33 IST

    Golden Temple: ‘స్వర్ణ దేవాలయాన్ని RDXతో లేపేస్తాం’.. బాంబు బెదిరింపులు కలకలం

    పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయానికి (హర్మందిర్ సాహిబ్) బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్వర్ణ దేవాలయ నిర్వాహక కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కొత్త రాష్ట్ర సైబర్ సెల్, ఏజెన్సీల సహాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

     

    Golden Temple bomb threat
    Golden Temple bomb threat

     



  • Jul 15, 2025 07:33 IST

    BIG BREAKING: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్‌పై కాల్పులు..! స్పాట్‌డెడ్‌

    మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్‌ యువనాయకుడు మారెల్లి అనిల్‌(35) అనుమానాస్పద మృతిచెందాడు. అతని కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • Jul 15, 2025 07:32 IST

    Trump Warns Russia: 50 రోజుల టైమ్ అంతే..లేకపోతే మీ అంతమే..రష్యాకు ట్రంప్ వార్నింగ్

    50 రోజుల్లో ఉక్రెయిన్ తో కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాలి లేకపోతే తీవ్రమైన సుంకాలతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ మాట వినకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

     

    Trump
    Trump

     



Advertisment
Advertisment
తాజా కథనాలు