/rtv/media/media_files/2025/07/15/husband-commits-suicide-after-his-wife-refuse-to-eat-chicken-in-tamil-nadu-2025-07-15-15-08-24.jpg)
Husband Commits Suicide after his wife refuse to eat chicken in Tamil Nadu
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో సక్కోట్టై ప్రాంతంలో మణికంఠన్ (29) ఉంటున్నాడు. ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేవాడు. అయితే తనతో కలిసి పనిచేసే సుబలక్ష్మీ(25) అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చోసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ వాళ్ల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.
Also Read: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా
Also Read : ఆకాశాన్ని తాకుతున్న టెస్లా ధరలు.. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఎందుకు ఎక్కువ?
Husband Commits Suicide
దీంతో నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ఎదురించి చెన్నైలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ నవదంపతులు తిరప్పూల్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మీ సోదరి మేనక ఇంటికి వెళ్లారు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నారు. అయితే మేనక, తన భర్త ఆదివారం ఓ ఆలయ ప్రత్యేక కార్యక్రమం కోసం తిరచ్చుకి వెళ్లారు. దీంతో మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ తీసుకొచ్చాడు. భార్యను తినమని అడిగాడు.
Also Read: పాత రూ.2వేల నోట్లు తీసుకొని.. అక్కడ రూ.1200, రూ.1600 ఇస్తున్నారు
కానీ సుబలక్ష్మీ ఇందుకు ఒప్పుకోలేదు. తన సోదరి గుడికి వెళ్లినందువల్ల ఇంట్లో చికెన్ తినేందుకు ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన మణికంఠన్ ఇంటి బయట ఇనుప కడ్డీకి చీరతో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మణికంఠన్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Also Read : జల్సాలకు అలవాటు పడిన కొడుకు.. చంపి పాతిపెట్టిన తండ్రి!
telugu-news | rtv-news | tamil-nadu | wife-and-husband | suicide | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | national news in Telugu