/rtv/media/media_files/2025/07/15/rahul-gandhi-2025-07-15-17-48-32.jpg)
Rahul Gandhi
భారత్ జోడోయాత్రలో భాగంగా 2022లో భారత ఆర్మీని రాహుల్ గాంధీ కించపరిచారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఆయనకు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ.20 వేల పూచీకత్తు, రెండు బాండ్లను రాహుల్ గాంధీ న్యాయవాదులు సమర్పించారు. అయితే ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13కు కోర్టు వాయిదా వేసింది. 2022, డిసెంబర్ 16న భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: సోషల్ మీడియా పోస్టులపై సుప్రీం కీలక ఆదేశాలు..ఇక దబిడి దిబిడే...
Also Read : ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
Lucknow Court Grants Bail To Rahul Gandhi
అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సైనికులను చైనా కొడుతున్నా కూడా భారత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. LOC వెంబడి చైనా చర్యలను భారత్ ఎందుకు అడ్డుకోలేకపోతుందని విమర్శించారు. ఈ క్రమంలోనే భారత ఆర్మీ సైనికుల్ని కించపరిచారని.. రాహుల్‌పై పలువురు కేసు పెట్టారు. దీంతో ఈ వ్యవహారంలో ఆయనపై పరువు నష్టం కేసు దాఖలైంది. అయితే తాజాగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: భూమిపైకి శుభాంశు శుక్లా.. అంతరిక్షంలో 60 రకాల ప్రయోగాలు
ఇదిలాఉండగా గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరిలో ఈ కేసులో ఆయనకు ఊరట లభించింది. దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లో చైబాసా నిర్వహించిన సభలో రాహుల్.. అమిత్ షాపై ధ్వజమెత్తారు. ఆయన హంతకుండు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో బీజేపీ నేత నవీన్ ఘా రాహుల్‌పై కేసు పెట్టారు.
Also Read : క్రేజీ అప్డేట్.. 'మహారాజ' డైరెక్టర్ తో తలైవా నెక్స్ట్ ప్రాజెక్ట్!
congress | bharat-jodo-yatra | Rahul Gandhi | rtv-news | telugu-news