Trump Warns Russia: 50 రోజుల టైమ్ అంతే..లేకపోతే మీ అంతమే..రష్యాకు ట్రంప్ వార్నింగ్

50 రోజుల్లో ఉక్రెయిన్ తో కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాలి లేకపోతే తీవ్రమైన సుంకాలతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ మాట వినకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

New Update
Trump

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అగ్రరాజ్యాధినేత ట్రంప్ మరోసారి మండిపడ్డారు. పుతిన్ మొండివైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని 50 రోజుల్లో ముగించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున సుంకాలతో శిక్షిస్తానని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నీ విన్నట్టే కనిపిస్తారు. చక్కగా మాట్లాడతారు. కానీ వెంటనే రాత్రి పూట బాంబులు వేసి భీభత్సం సృష్టిస్తారు అంటూ ట్రప వ్యాఖ్యలు చేశారు.  ఓవల్‌ ఆఫీస్‌లో నాటో  సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టేతో సమావేశమైన సందర్భంగా ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. పైగా తాను ఈ మధ్య చాలాసార్లు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించానని..బాగా పని చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే రష్యా పై ఎలాంటి సుంకాలు విధిస్తారు అనే దానిపై మాత్రం ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. 

నాటోకు ఆయుధాలు అందజేస్తాం..

మరోవైపు యుద్ధంలో ఉక్రెయిన్ కు సహాయంగా ఉంటామని మళ్ళీ హామీ ఇచ్చారు. అత్యాధునిక ఆయుధాలను నాటోకుే అందజేస్తామని.. అది ఉక్రెయిన్ తో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. నాటోకు పంపే ఆయుధాలలో పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు, బ్యాటరీలు ఉంటాయని కూడా తెలిపారు. ఉక్రెయిన్‌, రష్యాలకు ట్రంప్‌ ప్రత్యేక ప్రతినిధి రిటైర్డ్ లెఫ్టినెంట్‌ జనరల్‌ కీథ్‌ కెలాగ్‌ నిన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఆయుధాల కొనుగోలు, రష్యాపై ఆంక్షలు తదితర అంశాల్లో తమ చర్చలు సానుకూలంగా సాగినట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు.

Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

Advertisment
Advertisment
తాజా కథనాలు