BIG BREAKING: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్‌పై కాల్పులు..! స్పాట్‌డెడ్‌

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్‌ యువనాయకుడు మారెల్లి అనిల్‌(35) అనుమానాస్పద మృతిచెందాడు. అతని కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు.

New Update
Medak anil death

Medak congress leader anil death

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్‌ యువనాయకుడు మారెల్లి అనిల్‌(35) అనుమానాస్పద మృతిచెందాడు. అతని కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. హత్య.. ఆత్మహత్య అన్న కోణంలో విచారణ చేపట్టినట్లు ఎస్సై మహ్మద్‌ గౌస్‌ తెలిపారు. పోస్టుమార్టం కోసం అనిల్‌ మృతదేహాన్ని మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మారెల్లి అనిల్‌

కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనిల్‌ మొదట రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు ప్రకటించారు. పెట్రోలు బంక్‌ నిర్వహిస్తున్న అనిల్‌.. సోమవారం రాత్రి మెదక్‌ నుంచి స్వగ్రామానికి కారులో బయల్దేరాడు. ఇదే మండలం చిన్నఘనపూర్‌ విద్యుత్తు ఉపకేంద్రం వద్ద కారు అదుపు తప్పి కల్వర్టుకు ఢీకొట్టింది. దీంతో కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. అనిల్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడున్న వారు గమనించి మెదక్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. అయితే పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా బుల్లెట్ల విషయం వెలుగులోకి వచ్చింది.

medak | congress leader attack | crime news | senior-leader | Congress Party SC Cell President | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు