K-RAMP Glimpse: ది రిచెస్ట్ చిల్లర్.. 'K-Ramp' గ్లింప్స్ రిలీజ్.. ఆ బూతులు ఏంది సామి!

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం 'కె-ర్యాంప్' నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మాస్ లుక్, ఫన్నీ, అడల్ట్ డైలాగ్స్‌తో కిరణ్ ఎంటర్‌టైన్ చేశాడు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.

New Update

K-RAMP Glimpse: ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), అప్పటి నుండి ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించినా సరైన హిట్ అందుకోవడంలో వెనుకబడ్డాడు అనే చెప్పాలి. కానీ, గత ఏడాది ‘క’ అనే థ్రిల్లర్ మూవీతో మంచి హిట్ అందుకుని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. అదే ఫార్ములాను కొనసాగిస్తూ ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Also Read:అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌‌ఫోన్.. కెమెరా సూపరెహే!

ఈసారి ఒక్కొక్కరికీ బుర్ర పాడు...

తాజాగా ఈ సినిమా నుంచి ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ అనే గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో కిరణ్ అబ్బవరం పూర్తిగా మాస్ అవతారంలో కనిపిస్తూ ఫుల్ ఎనర్జీతో అలరించాడు. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ ఫన్ లోడెడ్ ఇంకా, కలర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ‘కుమార్’ అనే పాత్రలో కనిపించనున్నాడు, తన మార్క్ ఫన్నీ, మాస్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌లో అందరిని ఆకట్టుకున్నాడు. "చేటలు ఎల్లారుకూ నమస్కారం.. ఈసారి ఒక్కొక్కరికీ బుర్ర పాడు...*** జారుడే" అనే డైలాగ్‌తో గ్లింప్స్ అదరగొట్టేసాడు. చివర్లో వచ్చే  "మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం. కానీ తెలుగు ప్రేమకథలతోనే మనకు ఇబ్బంది. ఎందుకంటే మన సినిమాల్లో ఆ నిజమైన భావోద్వేగం ఉండదు" అంటూ ఒక యూట్యూబర్ ను ఇమిటేట్ చేస్తూ సెటైర్లు కూడా వేసాడు.

Also Read:తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా కావడం విశేషం. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్ పై  నిర్మాతలుగా రాజేశ్ దండ, శివ బొమ్మక్, యుక్తి తరేజా కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటులు నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ సినిమాకి సంగీతం చేతన్ భరద్వాజ్ అందిస్తున్నారు.

Also Read:ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

ఈ మూవీ అక్టోబర్ 18, 2025న థియేటర్లలో విడుదల కానుంది ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మళ్లీ తన ఎనర్జీని, మాస్ అప్పీల్‌ను నిరూపించుకోగలడా అనే ప్రశ్నకు జవాబు ఈ అక్టోబర్‌లో తెలుస్తుంది. మొత్తానికి  ‘కె-ర్యాంప్’ గ్లింప్స్ మాత్రం ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ వైరల్ అవుతూ సినిమా పై అంచనాలను పెంచేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు