/rtv/media/media_files/2025/07/15/discussions-with-the-center-on-godavari-projects-2025-07-15-20-14-25.jpg)
Discussions with the Center on Godavari projects
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి ఛైర్మన్‌గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల ఎపెక్స్ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. అందులో భాగంగా గోదావరి, కృష్ణ నదులపై ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఏపీ, తెలంగాణ సీఎంలకు పిలుపువచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచర్ల అజెండాపై అభ్యంతరం తెలిపింది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : భట్టికి బిగ్ షాక్..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్ నోటీసులు
Key Decision On CMs' Meeting
అదే సమయంలో కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను అజెండాగా తెలంగాణ ప్రతిపాదించింది. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయహోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని అజెండాగా పంపించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగం కోసం కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. అదే సమయంలో బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో వివరించింది. గోదావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని స్పష్టం చేసింది.
ఇది కూడా చూడండి: Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ నెల 16న (బుధవారం) సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తిశాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సీఎస్‌లకు సమాచారం పంపించింది. దిల్లీలోని జలశక్తిశాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తిభవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మాట్లాడాల్సిన ఎజెండా పాయింట్లు ఏమైనాఉంటే వెంటనే పంపాలని జలశక్తిశాఖ కోరింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా ఇచ్చింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకొనేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇది కూడా చూడండి: Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
confluence-of-godavari-krishna | union-minister | telangana government news | Banakacharla | Water Board Act