Marathon Runner Fauja Singh: 114ఏళ్ల వయసులో ఫౌజా సింగ్ మృతి.. ఈయన గురించి తెలిస్తే షాక్!

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా పేరుగాంచిన ఫౌజా సింగ్ (114) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బియాస్‌లో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పౌజా సింగ్ పేరు మీద ఎన్నో ప్రపంచ రికార్డులు ఉన్నాయి.

New Update
Fauja Singh

Marathon Runner Fauja Singh

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా పేరుగాంచిన ఫౌజా సింగ్ (114) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బియాస్‌లో సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే జలంధర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ఫౌజా సింగ్ మరణంతో క్రీడా ప్రపంచం, ముఖ్యంగా మారథాన్ రన్నింగ్ ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

89వ ఏట ప్రారంభమైన పరుగు 

ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని బియాస్ గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో ఐదేళ్ల వయసు వచ్చేవరకు నడవలేకపోయిన ఆయన, యువకుడిగా వ్యవసాయంలో నిమగ్నమయ్యారు. అయితే, ఆయన జీవితంలో 1992వ సంవత్సరం ఒక మలుపు తీసుకొచ్చింది. తన భార్య జియాన్ కౌర్ మరణంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన ఆయన, ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లారు. అక్కడే ఆయనకు మారథాన్ రన్నింగ్‌పై ఆసక్తి పెరిగింది.

ఏజ్ ఈజ్ ఏ జస్ట్ నెంబర్

89 ఏళ్ల వయసులో మారథాన్ రన్నింగ్ ప్రారంభించిన ఫౌజా సింగ్, వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించారు. లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి అనేక అంతర్జాతీయ మారథాన్‌లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల పూర్తి మారథాన్‌లను విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. టొరంటో మారథాన్‌ను 5 గంటల 44 నిమిషాల 4 సెకన్లలో పూర్తి చేయడం ఆయన అసాధారణ ప్రతిభకు నిదర్శనం. 'టార్బన్డ్ టోర్నాడో'గా ప్రసిద్ధి చెందిన ఆయన, వందేళ్లు దాటిన తర్వాత కూడా మారథాన్‌లలో పాల్గొని పలు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు.

డ్రగ్ వ్యతిరేక ఉద్యమాలలో కూడా ఫౌజా సింగ్

పలు ప్రచార కార్యక్రమాలలో, ముఖ్యంగా "నషా ముక్త్ - రంగ్లా పంజాబ్" వంటి డ్రగ్ వ్యతిరేక ఉద్యమాలలో కూడా ఫౌజా సింగ్ చురుకుగా పాల్గొన్నారు. ఆయన మరణంపై పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియాతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఫౌజా సింగ్ వారసత్వం, ఆయన దృఢ సంకల్పం, ఆరోగ్యంపై ఆయనకున్న పట్టుదల తరతరాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు