Ind Vs Eng: సిరాజ్ షాకింగ్ ఔట్..ఓటమి నిరాశలో భారత్..

లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది. గెలుపు ముంగిట వరకు వచ్చి ఓడిపోయింది. చివరి వికెట్ సిరాజ్ అనూహ్యంగా అవుట్ అవడంతో భారతజట్టు నిరాశలో మునిగిపోయింది. 

New Update
siraj

Siraj Out

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో మహమ్మద్ సిరాజ్ షాకింగ్ రీతిలో ఔటయ్యాడు. సిరాజ్ 30 బంతుల్లో 4 పరుగులు చేసి షోయబ్ బషీర్ చేతిలో ఔట్ అయ్యాడు. దీంతో భారత జట్టు ఓటమి పాలయ్యింది. షోయబ్ బౌలింగ్ లో సిరాజ్ బంతిని డిఫెండ్ చేసాడు..కానీ ఓవర్ స్పిన్ బంతిని తిరిగి తన స్టంప్స్ కు తీసుకెళ్లి బెయిల్స్ ను తొలగించింది. అతని పక్క నుంచి వెళ్ళి స్టంపస్ ను తాకింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ వేసిన బంతి సిరాజ్ ఊహించిన దానికంటే ఎక్కువ బౌన్స్ అయిందని నిపుణులు చెబుతున్నారు. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రవీంద్ర జడేజా , మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. మర ఎండ్ లో ఉన్న జడేజా వీరోచితంగా ఆడినా ప్రయోజనం దక్కలేదు. దీంతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల సీరీస్ లో 2-1తో భాతర్ వెనుకబడుపోయింది. 

లక్ష్యం చిన్నదే కానీ..

193 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా మొదట్లోనే తడబడింది. చివరకు 170 పరుగులు వద్ద అలౌట్‌ అయ్యింది. అయితే ఇప్పటి వరకు లార్డ్స్ వేదికలో టీమిండియా ఒకసారి మాత్రమే విజయం సాధించింది. భారత్ చివరిగా 1986లో లార్డ్స్‌లో విజయం సాధించగా ఇప్పుడు ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో ప్రధాన బ్యాటర్లు అందరూ విఫలం కావడం, ఇంగ్లాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడం భారత్ ఓటిమికి దారి తీసింది. బెన్‌ స్టోక్స్‌ (3/48) పదునైన బౌలింగ్, జోఫ్రా ఆర్చర్‌ (3/55) కూడా విజయంలో కీలక పాత్ర పోషించారు. దీనికి తోడు పిచ్ కూడా బాగా స్వింగ్ అవుతూ బౌలర్లకు సహకరించింది. లక్ష్యం చిన్నదే కానీ ఇండియా బ్యాటర్లు వరుసపెట్టి క్యూ కట్టేశారు. అదో రోజు ఉదయం మ్యాచ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి షాక్ ల షాకులు తగిలాయి. పంత్, రాహుల్ వరుసగా అవుట్ అయిపోయారు. దాని తరువాత సుందర్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఉదయం సెషన్ లోనే మూడు వికెట్లు పడిపోవడంతో ఇండియా పెద్ద తేడాతో ఓడిపోతుంది అనుకున్నారు. కానీ టీమ్‌ఇండియా తేలిగ్గా లొంగలేదు.జడేజా ఓపికగా ఆడాడు. అతనికి నితీశ్, బుమ్రాలు సహకారం అందించారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు పట్టువదలకపోవడంతో భారత్ కు నిరాశ తప్పలేదు. 

Also Read: Trump Warns Russia: 50 రోజుల టైమ్ అంతే..లేకపోతే మీ అంతమే..రష్యాకు ట్రంప్ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు