/rtv/media/media_files/2025/07/15/ramchander-rao-vs-mallu-bhatti-vikramarka-2025-07-15-18-05-38.jpg)
Ramchander Rao vs Mallu Bhatti Vikramarka
BREAKING: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టికి బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు పరువు నష్టానికి సంబంధించి లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు లీగల్ నోటీసు జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన మీడియా ఓ సమావేశంలో భట్టి మాట్లాడుతూ... రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తోందని, దళితులు, ఆదివాసీల పట్ల బీజేపీకి గౌరవం లేదని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చూడండి:Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!
రోహిత్ వేముల ఆత్మహత్యపై.. అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తన అడ్వకేట్ విజయ కాంత్‌తో భట్టికి లీగల్ నోటీసులు పంపించారు.3 రోజుల్లో భట్టి విక్రమార్క ఈ విషయమై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రూ.25 కోట్లు పరువు నష్టం దావా చెల్లించాలంటూ నోటీసులు పంపించారు.
Also Read : Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
భట్టి తనను తనను ఉద్దేశిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా భావించిన రాంచందర్‌రావు ఐ నోటీసులు జారీ చేసారు. రోహిత్ వేముల కేసు దర్యాప్తు ముగిసిందని, దానికి ఎవరూ బాధ్యులు కాదని కోర్టులో తేలిన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని, దళిత సమాజాన్ని రాజకీయంగా వాడుకునే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని రాంచందర్‌రావు విమర్శించారు.
ఇది కూడా చూడండి: Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ