Dheeraj Kumar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.

New Update
Dheeraj Kumar passed away

Dheeraj Kumar passed away

బాలీవుడ్ ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తీవ్రమైన శ్వాస సమస్యలతో ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో  చేరారు. అక్కడ ఆయనకు న్యుమోనియా ఉన్నట్లు నిర్ధారించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స అందిస్తుండగా.. ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

Also Read :  ఎమ్మెల్యేపై వాటర్‌ బాటిల్‌తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..

Also Read :  నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

సినీ ప్రముఖుల సంతాపం

ధీరజ్ కుమార్ మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు,  అభిమానులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. సినీ తారలు, ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 

1965లో సినీ రంగ ప్రవేశం చేసిన ధీరజ్ కుమార్ హిందీ , పంజాబీ చిత్రాలలో తనదైన ముద్ర వేశారు. 1970 నుంచి 1984 మధ్య ఆయన 21 పంజాబీ చిత్రాలలో నటించారు. ఆ తర్వాత 'క్రియేటివ్ ఐ' అనే నిర్మాణ సంస్థను స్థాపించారు, ఈ సంస్థ 'ఓం నమః శివాయ' వంటి అనేక ఆధ్యాత్మిక,  పౌరాణిక సీరియల్స్ ని  నిర్మించింది. ఆయన 'స్వామి', 'హీరా పన్నా', 'రాత్ కా రాజా' వంటి పలు హిందీ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ధీరజ్ కుమార్ అంత్యక్రియలు రేపు  ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరగనున్నాయి. ఆయన మృతదేహాన్ని రేపు ఉదయం 6 గంటలకు ఇంటికి తీసుకువచ్చి, ఉదయం 10 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.

Also Read:BIG BREAKING: తెలంగాణ హైకోర్టులో చిరంజీవి పిటిషన్.. ఆ అంశంపై కోర్టుకెక్కిన మెగాస్టార్!

Also Read :  ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!

latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | Bollywood Actress | bollywood-actor | bollywood updates

Advertisment
Advertisment
తాజా కథనాలు