Muralidhar Rao: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కీలక పరిణామం...మాజీ ఈఎన్‌సీ మురళీధరరావు అరెస్ట్‌

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహారించిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌) మురళీధరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

New Update
Muralidhar Rao

Muralidhar Rao

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహారించిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌) మురళీధరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్న అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మురళీధరరావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కలిపి మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి. వివిధ పత్రాలను స్వాధీనం చేసుకోగా భారీగా ఆస్తులను గుర్తించారు.

Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

Key Development In Kaleshwaram Project Case

మురళీధరరావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్‌ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం తొలగించింది. మురళీధర్‌ రావుకు సంబంధించిన మొత్తం 11 చోట్ల ఈ తనిఖీల్లో ఆయన పేరు మీద కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్, కరీంనగర్లో, వరంగల్, కోదాడలో భారీ భవనాలున్నట్టు గుర్తించారు. కోకాపేట, బంజారాహిల్స్, యూసఫ్ గూడా, బేగంపేట్ ప్రాంతాల్లో కోట్ల విలువ చేసేప్లాట్లు, ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు. అలాగే సోలార్ పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్ శివారులో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 చదరపు గజాల స్థలంతోపాటు కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.

ఇది కూడా చూడండి:  Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ

కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర పోషించిన మురళీధర్ రావు.. ఆ సమయంలో పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం నిధులను తన కుమారుడు అభిషేక్ రావుకు చెందిన సొంత కంపెనీల హర్ష కన్ స్ట్రక్షన్ కు మళ్లించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంతో పాటు పాలమూరులోను భారీగా సబ్ కాంట్రాక్ట్ లు చేశారని, తన కుమారుడు అభిషేక్ బినామీలకు లబ్ధి చేకూరేలా మురళీధర్ రావు వ్యవహరించినట్లు సమాచారం. వర్క్ ఆర్డర్స్ జారీలోనూ మురళీధర్ రావు అకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read : భట్టికి బిగ్‌ షాక్‌..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్‌ నోటీసులు

ఇది కూడా చూడండి:Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!

acb-raids | acb-raid | acb-court | acb-attack | ACB Notices | ACB Investigation | muralidar | kaleswaram-project

Advertisment
Advertisment
తాజా కథనాలు