/rtv/media/media_files/2025/07/15/indian-two-thousand-notes-2025-07-15-10-41-57.jpg)
Indian currency Circulation In Nepal
భారతదేశంలో రూ. 2వేల నోట్ల ఉపసంహరణ తర్వాత, నేపాల్ సరిహద్దు ప్రాంతాలలో అవి చలామణి అవుతున్నాయని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తులో తేలింది. అధికారికంగా నేపాల్‌లో రూ. 100 కంటే ఎక్కువ విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్లు చెల్లుబాటు కావు. అయితే, సరిహద్దు ప్రాంతాలలో కొంతమంది వ్యక్తులు, మధ్యవర్తులు ఇప్పటికీ ఈ నోట్లను అంగీకరిస్తున్నారని తెలిసింది. రూ.2వేల నోట్లు తీసుకొని వాటికి బదులుగా రూ.1200 నుంచి రూ.1600 వరకు ఇస్తున్నట్లు ఆదాయపు పన్నుశాఖ దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరిలో నేపాల్ సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో లక్నోలోని ఆదాయపు పన్నుశాఖ దర్యాప్తు విభాగం దాడులు చేసి కీలకమైన ఆదేశాలు సేకరించింది. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నది.
ప్రస్తుతం నిబంధనల ప్రకారం రూ.2వేల నోట్లను RBI కార్యాలయాలు, పోస్టాఫీస్‌లలో మాత్రమే డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంది. దీనికి రూ.30వేల పరిమితి ఉంది. ప్రస్తుతం ఆదాయపు పన్నుశాఖ నేపాల్ సరిహద్దులో ఉన్న పోస్టాఫీసులపై దృష్టి సారించాయి. నోట్లను మార్చుకునే వ్యక్తులు ఫేక్ ఐడీలను ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్ ప్రభుత్వం 2018లోనే రూ. 200, రూ. 500, రూ. 2000 నోట్ల వినియోగాన్ని నిషేధించింది. కేవలం రూ. 100 మరియు అంతకంటే తక్కువ విలువ గల భారతీయ నోట్లు మాత్రమే నేపాల్‌లో అధికారికంగా చెల్లుబాటు అవుతాయి. నవంబర్ 2016లో భారత ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసినప్పుడు, నేపాల్‌లో భారీ మొత్తంలో పాత భారతీయ కరెన్సీ చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ (నేపాల్ సెంట్రల్ బ్యాంక్) రూ. 100 కంటే ఎక్కువ విలువైన నోట్లను తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. నేపాల్‌తో సరిహద్దు పంచుకునే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి భారత రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో కొంతమంది ప్రజలు, వ్యాపారులు అనధికారికంగా రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నారని నివేదించబడింది.