/rtv/media/media_files/2025/07/15/cyber-attacks-on-india-2025-07-15-07-13-36.jpg)
పోలీసులు ప్రజల్ని ఎంత అప్రమత్తం చేసినా.. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ కొత్తకొత్త టెక్నిక్స్‌తో రెచ్చిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్న కేటుగాళ్ల వలలోపడి పైసలు పోగొట్టుకుంటున్నారు అమాయకపు ప్రజలు. సైబర్ నేరగాళ్లకు మొత్తం ఆసియా ఖండంలోనే ఇండియన్స్ ఈసీగా చిక్కుతున్నారు. ఈ మోసాల్లో అత్యధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ అంచనా వేసింది. 2025లోని మొదటి 5 నెలల్లో ఆన్‌లైన్ మోసాల వల్ల భారతీయులకు దాదాపు రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, వాటిలో సగానికిపైగా నేరాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుంచి పనిచేస్తున్న సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లే కారణమని పేర్కొన్నది.
సైబర్ క్రైమ్‌లో ఆర్థిక నేరాల వల్ల మన దేశం ప్రతి నెలా రూ.1,000 కోట్లు నష్టపోతున్నదని ఈ ఏడాది జరిగిన సైబర్ మోసాల విశ్లేషణలో తేలింది. సైబర్ నేరాల కోసం ఇండియన్స్‌ను ఏజెంట్లగా నియమించుకుంటున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ ఏజెంట్లు ఎక్కువగా లావోస్, మయన్మార్, కంబోడియాలో పనిచేసేందుకు నియమించుకుంటున్నారని చెప్పారు.