Supreme Court:  సోషల్‌ మీడియా పోస్టులపై సుప్రీం కీలక ఆదేశాలు.. ఇక దబిడి దిబిడే...

సోషల్‌ మీడియాలో కొందరు యూట్యూబర్లు, స్టాండప్‌ కమెడియన్లు, కళాకారులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని సుప్రీం కోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

New Update
Supreme Court

Supreme Court's key orders on social media posts

సోషల్‌ మీడియాలో కొందరు యూట్యూబర్లు, స్టాండప్‌ కమెడియన్లు, కళాకారులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని సుప్రీం కోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సోషల్‌ మీడియాలో ఏం చేసినా.. ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి పలువురిలో కనిపించడం శోషనీయమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని సుప్రీం మండిపడింది. ప్రధానిమోదీ, ఆరెస్సెస్‌పై కార్టూనిస్టు హేమంత్‌ మాలవీయ వేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉండటంతో  కేసు నమోదైంది. కాగా అరెస్ట్‌ నుంచి తనకు రక్షణ కల్పించాలని కార్టూనిస్టు హేమంత్‌ మాలవీయ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక  వ్యాఖ్యలు చేసింది. 

Also read: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. 10 లక్షల మందికి ఉపాధి

Supreme Court Orders On Social Media Posts

ఇప్పటికే వజహత్‌ఖాన్‌ అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కేసులోనూ అభ్యంతరాలు వ్యక్తం చేసిన కోర్టు ఈరోజు హేమంత్‌ మాలవీయ కేసులోనూ కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వనియోగం చేయవద్దని హెచ్చరిస్తూ..అరెస్టు నుంచి సుప్రీం కోర్టు రక్షణ కల్పించింది. అదే సమయంలో సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులను షేర్‌ చేస్తే మాత్రం చట్టంప్రకారం అతడిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉందని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్‌ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. 

Also Read :  ఎమ్మెల్యేపై వాటర్‌ బాటిల్‌తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..

అంతకు ముందే వజహత్‌ఖాన్‌ కేసులోనూ కీలక వ్యాఖ్యలు చేసింది.భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వయం నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. అభ్యంతరకర పోస్టులను సోషల్‌ మీడియాలో నిరోధించేందుకు వీలుగా మార్గదర్శకాలు తెచ్చే యోచన చేస్తున్నామని తెలిపింది. ‘ఈ పోస్టులు పౌరులను కలవరపరచడం లేదా?’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

Also Read: అన్‌డాకింగ్‌ సక్సెస్‌ఫుల్‌.. మరికొన్ని గంటల్లో భూమిపైకి శుభాంశు బృందం

ఇదే సమయంలో జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ.. సోషల్‌మీడియాలో వ్యాపించిన విభజన ధోరణులను కట్టడి చేయాల్సిందేనన్నారు. అయితే, దీని అర్థం సెన్సార్‌ను అమలు చేయాలనేది కాదని, తాము స్వయం నియంత్రణల గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. ‘‘భావస్వేచ్ఛను పౌరులు అనుభవించాలనుకుంటే కొన్ని నియంత్రణలను వారు తమకు తాముగా పాటించాలి. ఇలా ఉల్లంఘనలకు పాల్పడరాదు.’’ అని వ్యాఖ్యానించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (2) విధించిన నియంత్రణలు సరిగ్గానే ఉన్నాయన్నారు. ‘‘సోషల్‌ మీడియాలో పెట్టే కంటెంట్‌ విషయంలో తప్పనిసరిగా కొంత నియంత్రణ ఉండాలి. అటువంటి పోస్టులకు పౌరులు దూరంగా ఉండాలి. వాటిని షేర్‌ చేయడం, లైక్‌ చేయడం చేయరాదు’’ అని కోర్టు సూచించింది. 

Also Read: మోదీపై అభ్యంతరకర కార్టూన్‌.. భావా ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగంపై సుప్రీం ఆగ్రహం

Social Media | social media accounts | social media reels | social media bad effect | social media threat assault | stand-up-comedy | youtubers

Advertisment
Advertisment
తాజా కథనాలు