Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

నిమిష ప్రియకు జులై 16న యెమెన్‌లో మరణశిక్ష విధించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆమెను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

New Update
Nimisha Priya

Nimisha Priya

Nimisha Priya

నిమిష ప్రియకు జులై 16న యెమెన్‌లో మరణశిక్ష విధించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆమెను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమెను రక్షించేందుకు బ్లడ్ మనీ ఒక్కటే దారి. అంటే బాధిత కుటుంబానికి భారీ మొత్తంలో పరిహారం ఇవ్వాలి. ఇందుకోసం నిమిష ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు అంటే రూ.8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కానీ వారి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

Also Read: పాత రూ.2వేల నోట్లు తీసుకొని.. అక్కడ రూ.1200, రూ.1600 ఇస్తున్నారు

మరోవైపు భారత్‌కు చెందిన ఓ ప్రముఖ మత గురవు కూడా నిమిష ప్రియను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్.. బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు. బాధిత కుటుంబంతో పాటు యెమెన్ స్థానిక అధికారులు, అక్కడి మత పెద్దలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. బ్లడ్ మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Also Read :  ఆకాశాన్ని తాకుతున్న టెస్లా ధరలు.. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఎందుకు ఎక్కువ?

అసలేంటి ఈ కేసు

నిమిష ప్రియ కేరళలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్‌కు వెళ్లి అక్కడే జాబ్‌లో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత యెమెన్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించాలనుకుంది. అయితే ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం నిమిష అక్కడున్న తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీళ్లద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నిమిష తన కూతురు సంప్రదాయ వేడుక కోసం భారత్‌కు వచ్చింది. అది ముగిశాక యెమెన్‌కు వెళ్లిపోయింది. 

నిమిష భర్త, కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోయారు. దీన్ని ఆసరగా చేసుకొని మెహది.. నిమిష ప్రియ నుంచి డబ్బు లాక్కునేవాడని, వేధించేవాడని ఆమె కుటుంబం ఆరోపించింది. ఆఖరికి ఆమె పాస్‌పోర్టును కూడా లాక్కున్నాడని చెప్పారు. దీంతో నిమిష.. తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకునేందుకు 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చింది. కానీ డోస్‌ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని ఆమె వాటర్‌ట్యాంక్‌లో పడేసింది. చివరికి ఆమె సౌదీకి వెళ్తుండగా.. సరిహద్దుల్లో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించింది. 

అయితే మృతుడి ఫ్యామిలీకి కొంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తే దోషులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్‌లో ఉంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నిమిష ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు అంటే రూ.8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  

Also Read :  జల్సాలకు అలవాటు పడిన కొడుకు.. చంపి పాతిపెట్టిన తండ్రి!

Also Read :  షార్జాలో కేరళ తల్లీబిడ్డల మృతి...భర్త కుటుంబానికి బిగ్ షాక్‌

Nimisha Chanda | Nimisha Priya News | nimisha priya death penalty

Advertisment
Advertisment
తాజా కథనాలు