Cinema: దర్శకుడు పా. రంజిత్ పై కేసు

తమిళ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న "వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టెంట్ చేస్తూ మృతి చెందాడు. దీంతో చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజ్ మృతి.

New Update
police case against Pa Ranjith

police case against Pa Ranjith

Pa Ranjith:  తమిళ్ డైరెక్టర్  పా. రంజిత్ పై పోలీస్ కేసు నమోదైంది.  ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న '"వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టంట్  చేస్తూ మృతి చెందాడు.  దీంతో చిత్ర బృందం నిర్లక్ష్యం కారణంగానే రాజు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆయన సన్నిహితులు డైరెక్టర్ పా. రంజిత్ సహా మరో ముగ్గురిపై కేసు నమోదు  చేశారు. నాగపట్టణం జిల్లాలోని కీళైయూర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు నమోదైంది. 

Also Read :  పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ

Also Read :  సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

గుండెపోటుతో

అయితే ఆర్య హీరోగా  తెరకెక్కుతున్న ఈ  చిత్రానికి రాజు స్టంట్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా, జూలై 13 (ఆదివారం) ఉదయం జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో కారుతో  హై రిస్క్ స్టంట్ చేశాడు. ఆ  సమయంలో ఊహించని ప్రమాదంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే స్టంట్ చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు సమాచారం. 

Also Read :  అమేజింగ్.. 16GB ర్యామ్, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వివో కొత్త ఫోన్ అదిరింది మచ్చా!

స్టంట్ మాస్టర్ రాజు హఠాత్మరణం తమిళ చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో  ముంచింది. లువురు సినీ ప్రముఖులు, హీరోలు రాజు మృతి పట్ల సంతాపం తెలియజేశారు. హీరో విశాల్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ అయ్యారు. అలాగే ఫైట్ మాస్టర్ సిల్వ స్టంట్ కూడా రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక గ్రేట్ స్టంట్ ఆర్టిస్ట్‌ను కోల్పోయామని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.   స్టంట్ యూనియన్, చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు అని ఎమోషనల్ అయ్యారు. 

Also Read :  బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపు

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | pa-ranjith

Advertisment
Advertisment
తాజా కథనాలు