Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా.. అంతరిక్షంలో 60 రకాల ప్రయోగాలు

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్‌ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది. శుక్లా నేతృత్వంలోని టీమ్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది.

New Update
Shubhanshu Shukla

Shubhanshu Shukla

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌(ISS)కు వెళ్లిన భారత ఆస్ట్రోనాట్‌ శుభాంశు శుక్లా బృందం తాజాగా భూమిపైకి దిగింది. శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 PM గంటలకు కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగారు. 

Also Read :  ఎమ్మెల్యేపై వాటర్‌ బాటిల్‌తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..

60 రకాల ప్రయోగాలు

శుభాంశు శుక్లా బృందం జూన్ 25న అమెరికాలోని నాసా  నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. 28 గంటల ప్రయాణం తర్వాత వారు ISSలోకి చేరుకున్నారు. అందులో శుక్లా నేతృత్వంలోని ఈ టీమ్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించడం విశేషం. శుభాంశుతో సహా నలుగురు వ్యోమగాములు ISSలో 18 రోజులు గడిపారు. 

Also Read: ఒడిశాలో నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి...సీఎం కీలక నిర్ణయం

అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టం గురించి శుభాంశు శుక్లా అధ్యయనం చేశారు. అంతేకాదు మానవ జీర్ణవ్యవస్థ అంతరిక్షంలో ఎలా పనిచేస్తుందనే దానిపై ఆయన భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ వీడియోను కూడా రూపొందించారు.  అలాగే ఈ నలుగురు వ్యోమగాములు తమ మానసిక స్థితిగతులపై కూడా ప్రయోగాలు చేశారు. ఓ ఫ్లోటింగ్ వాటర్‌ బబుల్‌ను తయారుచేసి అందులో గడిపారు. ఇది తన జీవితంలో అద్భుతమైన అనుభవమని శుభాంశు తెలిపారు. కిటికీ పక్కన కూర్చుని కిందకి చూడటం అనేది నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతని చెప్పారు. అంతేకాదు స్పేస్‌లో వ్యవసాయం దిశగా కూడా ఈ ఆస్ట్రోనాట్స్‌పలు పరీక్షలు నిర్వహించారు. 

Also Read: షార్జాలో కేరళ తల్లీబిడ్డల మృతి... భర్త కుటుంబానికి బిగ్ షాక్‌

శుభంశు శుక్లా టీమ్‌ ఐఎస్‌ఎస్‌లో 18 రోజులు గడిపి భూమి చట్టూ 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణం చేసింది. మొత్తం 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. ఇదిలాఉండగా అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన భూమిపైకి తిరుగు ప్రయాణమయ్యే ముందు ఓ వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ.. అక్కడి నుంచి భారత్‌ ఎలా కనిపిస్తుందో వర్ణించిన వైనాన్ని శుభాంశు గుర్తుకుచేసుకున్నారు. '' నేటి భారత్‌ సగర్వంగా తలెత్తుకుని సాగుతోంది. ఈరోజు నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను అంటూ అప్పట్లో రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు కూడా వ్యాఖ్యానించారు. 

Also Read :  నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

Axiom 4 mission | Shubhanshu Shukla ISS | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు