/rtv/media/media_files/2025/07/15/ap-forest-department-jobs-2025-07-15-07-08-17.jpg)
AP Forest Department Jobs
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. ఏపీలోని అటవీ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
AP Forest Department jobs 2025
మొత్తం పోస్టులు: 691 (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 435)
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది).
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష, శారీరక కొలతలు (Physical Measurement Test), నడక పరీక్ష (Walking Test) ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ. 25,220 - 80,910, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ. 20,000 - 70,000 వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 16, 2025
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 5, 2025 (అర్ధరాత్రి 11:59 వరకు)
అభ్యర్థులు మరింత సమాచారం కోసం, దరఖాస్తు చేసుకోవడానికి APPSC అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ను సందర్శించాలి.