BIG BREAKING: హైదరాబాద్‌‌లో కాల్పుల కలకలం.. ‘వ్యక్తి స్పాట్‌డెడ్’

హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్క్‌లో వాకర్స్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై తుపాకీతో ఫైరింగ్ చేశారు.

New Update
firing in hyd

firing in hyd Photograph: (firing in hyd)

హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్క్‌లో వాకర్స్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై తుపాకీతో ఫైరింగ్ చేశారు. దీంతో చందు నాయక్ స్పాడ్‌లో చనిపోయాడు.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదం కారణంగానే కాల్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నగరం నడిబొడ్డున కాల్పులు వినగానే ప్రజలంతా భయబ్రాంతులకు గురైయ్యారు. పార్క్‌లో స్థానికులు పరుగులు తీశారు. మృతుడు చందు నాయక్ నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లికి చెందిన వ్యక్తి. భూ తగాదాల కారణంగానే హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలికి చేరుకొని ఆధారాలు సేకరించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు