/rtv/media/media_files/2025/07/15/golden-temple-bomb-threat-2025-07-15-06-53-09.jpg)
Golden Temple bomb threat
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయానికి (హర్మందిర్ సాహిబ్) బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్వర్ణ దేవాలయ నిర్వాహక కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కొత్త రాష్ట్ర సైబర్ సెల్, ఏజెన్సీల సహాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
punjab Golden Temple
ఈ బెదిరింపు వచ్చిన తర్వాత శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC).. టాస్క్ ఫోర్స్‌ను స్వర్ణ దేవాలయం లోపల, పోలీసులను బయట మోహరించారు. ఈ మేరకు SGPC సభ్యుడు కుల్వంత్ సింగ్ మనన్ మాట్లాడుతూ.. సోమవారం బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని తెలిపారు. ఆ ఇమెయిల్‌లో RDX తో ఆలయాన్ని పేల్చివేస్తున్నట్లు ప్రస్తావించారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ బెదిరింపు మెయిల్‌లో టైం కూడా తెలిపారని చెప్పుకొచ్చారు.
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
అనంతరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అయితే ఈ బెదిరింపు ఇమెయిల్ భయం, గందరగోళాన్ని సృష్టించడానికి చేసినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని టాస్క్‌ఫోర్స్‌కు కఠినమైన సూచనలు ఇచ్చినట్లు మనన్ తెలిపారు. దీనితో పాటు ఇమెయిల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి దర్యాప్తు కూడా ప్రారంభించారు.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
ఇదిలా ఉంటే స్వర్ణ దేవాలయానికి బెదిరింపులు రావడం ఇది కొత్తేమీ కాదు. అంతకుముందు 7 మే 2025న భారతదేశంపై ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణిని ప్రయోగించిందని భారత సైన్యం పేర్కొంది. అయితే భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉండటం వల్ల ఆ ముప్పు సకాలంలో తప్పింది.